/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
Zaheerabad road accident : తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జహీరాబాద్-బీదర్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మామిడికి గ్రామం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ట్రక్కు ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
కాగా యాక్సిడెంట్ విషయం తెలియగానే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే న్యాల్‌కల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఈ ప్రమాదంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కేసు నమోదు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కాగా చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంగారెడ్డి జిల్లా మామిడిగి సమీపంలోని జహీరాబాద్-బీదర్ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఆటోను ఎదురుగా వస్తున్న ఒక భారీ ట్రక్కు ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో కమల (40) వడ్డీ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ కాగా, అంబ్యానాయక్ (55) భోజ్యానాయక్ తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అందరినీ కలిచివేసింది. విధి నిర్వహణకు వెళ్తున్న అంగన్వాడీ టీచర్ కమల మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు, పోలీసులు వెంటనే వారిని జహీరాబాద్, బీదర్ ఆసుపత్రులకు తరలించారు. కాగా, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు.
Follow Us