TG : జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మహిళలు దుర్మరణం

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పసుపులోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది.

New Update
FotoJet (5)

Four women died in road accident

TG:  జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం రాత్రి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 

స్థానికుల వివరాల ప్రకారం.. వ్యవసాయ పనుల నిమిత్తం వ్యవసాయ కూలీలు పసుపుకోతకు వెళ్లి  తమ పనిని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పసుపు లోడుతో ఉన్న ట్రాక్టర్‌లో ఎక్కారు. మార్గంమధ్యలో మల్లాపూర్‌ మండలం ముగిలిపేట వద్దకు రాగానే ట్రాక్టర్‌ అదుపుతప్పి నీటి గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టర్‌లో సుమారు 8 మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు