క్రైం Contaminated Water : కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. 90మందికి అస్వస్థత కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. సంజీవన్రావు పేటలో మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో కలుషితమైన నీరు తాగడం వల్ల ఇద్దరు మృతి చెందడంతో పాటు 90 మందికి పైగా తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. By Kusuma 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లవర్తో పారిపోయిన వివాహిత.. ఆత్మహత్య ప్లాన్.. ట్విస్టులే ట్విస్టులు! గుజరాత్లో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో పారిపోవాలని ప్లాన్ వేసింది. ఓ వృద్ధుడిని చంపి నిప్పంట్టించింది. అందులో తన బట్టలు వేసింది. దీని కారణంగా తను చనిపోయినట్లు ఫ్యామిలీని నమ్మించింది. రెండు నెలల తర్వాత ఆ ప్రేమ జంట పోలీసులకు చిక్కింది. By Seetha Ram 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ప్రాణం తీసిన బెట్టింగ్.. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు ఆన్లైన్ బెట్టింగ్లకు బానిస అయ్యి ఆత్మహత్య చేసుకుంటున్న యువకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం బెట్టింగ్ల వల్ల రూ.24 లక్షలు పోగొట్టుకోవడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. By Kusuma 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం! హైదరాబాద్- విజయవాడ హైవేపై ఐతవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న చెవిటికట్లు టీడీపీ నేత కోగంటి విష్ణువర్ధన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. By srinivas 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అత్యంత పాశవికంగా హత్య చేశారు.. పోలీసులపై మావోయిస్టుల సంచలన లేఖ అబూజ్మడ్ ఎన్ కౌంటర్పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. కాల్పుల్లో గాయపడిన 17 మందిని భద్రతాబలగాలు అత్యంత పాశవికంగా ఊచకోత కోశాయని తెలిపింది. ప్రజలు, ప్రజాసంఘాలు, మీడియా దీనిని ఖండించాలని కోరింది. మృతుల వివరాలు వెల్లడించింది. By srinivas 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ యువకుడి ప్రాణం తీసిన డీజే సౌండ్.. ఏమైందంటే? కోనసీమ కేంద్రమైన అమలాపురంలో దసరా ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో బండారులంక గ్రామానికి చెందిన పప్పుల వినయ్ డీజే సౌండ్ బాక్సుల వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇద్దరు పిల్లలను బావిలో తోసేసిన తండ్రి.. ఆ తర్వాత దారుణం దసరా పండుగ వేళ కామారెడ్డి జిల్లా నందివాడలో తీవ్ర విషాదం జరిగింది. చిట్టపు శ్రీనివాస్ తన ఇద్దరు కుమారులు విగ్నేష్, అనిరుధ్లను రాత్రి సమయంలో బావిలో తోసి చంపేశాడు. ఆపై తాను కూడా బావిలో పడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సిద్ధిఖీ మరణానికి కారణం మేమే.. వైరల్ అవుతున్న బిష్ణోయ్ గ్యాంగ్ పోస్ట్ ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్తో సన్నిహితంగా ఉండటం వల్లే హత్య చేశామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. By Kusuma 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ స్లమ్ ప్రాజెక్టే సిద్ధిఖీ హత్యకు కారణమా? అసలేంటి ఈ ప్రాజెక్ట్? బాబా సిద్ధిఖీ హత్యలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా ఉన్న సమయంలో స్లమ్ ప్రాజెక్టులో రూ.2000 కోట్ల భారీ స్కాం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. By Kusuma 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn