Arun Panwar : యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల బంగారం..వీడియో వైరల్‌..

కట్నం తీసుకోవడం చట్టరీత్యనేరం..అయితే కట్నం పేరు చెప్పకుండా చాలామంది బహుమతుల రూపంలో అత్తగారి కుటుంబం నుంచి పెద్దమొత్తంలో నగదు, నగలు తీసుకుంటున్నారు. తాజాగా అరుణ్ పన్వర్ అనే యూట్యూబర్ కట్నం కింద రూ.71 లక్షల నగదు, 21 తులాల బంగారం తీసుకోవడం సంచలనంగా మారింది.

New Update
FotoJet (23)

Arun Panwar wedding Dowry

Arun Panwar : కట్నం తీసుకోవడం చట్టరీత్యనేరం..అయితే కట్నం పేరు చెప్పకుండా చాలామంది బహుమతుల రూపంలో అత్తగారి కుటుంబం నుంచి పెద్దమొత్తంలో నగదు, నగలు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. తాజాగా అరుణ్ పన్వర్ అనే యూట్యూబర్ కట్నం కింద రూ.71 లక్షల నగదు, 21 తులాల బంగారం తీసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారటంతో కలకలం రేపింది.


 
 అరుణ్ పన్వర్ పెళ్లిలో బహుమతులుగా అతడు ఈ మొత్తాన్ని తీసుకున్నాడని అతని మద్ధతుదారులు కొందరు అంటుంటే మరికొందరేమో బహుమతి పేరిట కట్నం తీసుకున్నాడని మరికొంతమంది విమర్శిస్తున్నారు.ఈ విషయం పై నెట్టింట పలువురు నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి సదరు యూట్యూబర్‌ కు గతేడాది చివర్లో వివాహం జరిగింది.  దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారటం గమనార్వం. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. 
 
కాగా సుమిత్ అనే వ్యక్తి ఈ వీడియోను నెట్టింట పోస్టు చేసినట్లు తెలుస్తోంది. పన్వర్‌ నెలకు యూట్యూబ్‌ ద్వారా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడని ఆయన తెలిపారు. ఇంత సంపాదిస్తున్నా వధువు కుటుంబం నుంచి గిఫ్ట్ పేరిట కట్నం తీసుకున్నాడని ఆయన విమర్శించారు. కాగా ఆ వీడియోలో ఒక గంప నిండా పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఉన్నట్టు కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

 అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ కాలంలో కూడా వరకట్నం కొనసాగుతుండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో పాలుపంచుకున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కట్నానికి గిఫ్ట్ అని పేరు పెట్టి కొందరు తప్పించుకుంటున్నారని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. సంపన్న వర్గాల్లో కూడా ఈ ట్రెండ్ ఇంకా కొనసాగడం విచారకరమని అన్నారు. అయితే వరకట్నం తీసుకున్న వీడియో ఇంతలా వైరల్ అవుతున్నా వరుడిని ఎందుకు అరెస్టు చేయలేదని పలువురు ప్రశ్నించడం విశేషం. ఇక అతడి భార్య డాక్టర్‌ అని తెలుస్తోంది. అయినప్పటికీ ఒక యూట్యూబర్‌ను చేసుకోవడమే కాకుండా కట్నం ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

Advertisment
తాజా కథనాలు