/rtv/media/media_files/2026/02/03/fotojet-3-2026-02-03-19-30-37.jpg)
Mohan Babu University
Mohan Babu : ఓ వైపు కుటుంబ గొడవలు, మరో వైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గతంలో మంచు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్ మధ్య ఆస్తి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదం పోలీసులు, కోర్టుల వరకు వెళ్లింది. ఈ వివాదం కొంతవరకు సద్దుమణిగిందని అనుకుంటున్న సమయంలో తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. విద్యా్ర్థుల సమస్యలపై పోరాడుతున్న వామపక్ష పార్టీ విద్యార్థి నాయకులను మోహన్‌బాబు కిడ్నాప్ చేయించారని తిరుచానూరు పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది.
విద్యార్థి నాయకుల కిడ్నాప్
మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజుల దోపిడీ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో 26 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారని, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ స్పష్టం చేస్తూ వసూలు చేసిన డబ్బులు విద్యార్థులకు తిరిగి వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు డబ్బులు వెనక్కి ఇవ్వకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి యూనివర్సిటీకి 16 లక్షల రూపాయలు జరిమానా విధించింది. అయితే ఈ మొత్తం చెల్లించకుండా మోహన్ బాబు నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఈ ఉదయం కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి వెళుతున్న విద్యార్థి నాయకులు అక్బర్, వినోద్‌ను మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు ఎత్తుకెళ్లారు. విద్యార్థి సంఘ నేతల ఫిర్యాదుతో MBU యాజమాన్యంపై కేసు నమోదైంది. ఈ మేరకు తిరుచానూరు పీఎస్‌లో హీరో మోహన్ బాబు, ఆయన కొడుకు విష్ణు, PRO సతీష్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది.
40 మంది విద్యార్థులపై దాడి
మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లు 40 మంది విద్యార్థి నాయకులపైన దాడి చేసి కిడ్నాప్ చేశారని కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తక్షణమే బౌన్సర్ల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ సంఘటనకు బాధ్యులైన మోహన్ బాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా తిరుపతి నగరంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజుల దోపిడీ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో 26 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యుల తీరు మారకపోవడంతో ఈరోజు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడానికి వెళుతుండగా మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు వారిని ద్విచక్ర వాహనం పడదోసి, వాళ్లను కొట్టి కారులో బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేయడం దారుణమన్నారు.
ఏపీ వ్యాప్తంగా నిరసనలు
తిరుపతిలో విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్‌బాబు యూనివర్శిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని, కిడ్నాపర్‌లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ర్ట వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల ఆ పార్టీనాయకులు ఆందోళనలకు దిగారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్.అక్బర్ ఎస్.వి.యూనివర్సిటీ నాయకుడు వినోద్ కుమార్‌పై దాడిచేసి కిడ్నాప్ చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇంతటి దారుణానికి పాల్పడిన యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని, విద్యార్థులకు యూనివర్సిటీ చెల్లించాల్సిన కోట్లాది రూపాయల సొమ్మును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది.
Follow Us