Marriage Lady : అబ్బబ్బా.. మామూలు మాయలేడి కాదు.. ముగ్గురు మొగుళ్లను ముంచేసింది!

బెంగళూరుకు చెందిన ఒక కిలాడీ లేడీ తన అందం, తెలివితేటలతో ఏకంగా ముగ్గురిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకున్న ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ మాయలేడి బాధితులే స్వయంగా ఆమె అసలు

New Update
marriage lady

బెంగళూరు(bengaluru) కు చెందిన ఒక కిలాడీ లేడీ(Marriage Lady) తన అందం, తెలివితేటలతో ఏకంగా ముగ్గురిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకున్న ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ మాయలేడి బాధితులే స్వయంగా ఆమె అసలు రంగును పోలీసుల ముందు బయటపెట్టారు. 

దొడ్డబళ్ళాపురానికి చెందిన సుధారాణి అనే మహిళ ప్రేమ పేరుతో మగవారికి వల వేయడంలో దిట్ట. డబ్బున్న వారిని టార్గెట్ చేసి, వారిని పెళ్లి చేసుకుని, లక్షల రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత పరారవ్వడం ఈమె స్టైల్. తాజాగా ఈమె బాధితులు ఇద్దరు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మ్యారేజ్ కిలాడీ కథ వెలుగులోకి వచ్చింది. - karnataka

సుధారాణికి మొదట వీరేగౌడ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, విలాసాలకు అలవాటు పడిన సుధారాణి.. "నీకు బుల్లెట్ బైక్, కారు నడపడం రాదు" అంటూ భర్తను హేళన చేస్తూ, పిల్లలను వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది.

Also Read :  నిర్మలమ్మ రికార్డు..  దేశ చరిత్రలోనే తొలి ఆర్థిక మంత్రిగా!

డెలివరీ బాయ్‌ను పరిచయం చేసుకుని

మొదటి భర్తకు దూరమైన తర్వాత, అనంతమూర్తి అనే డెలివరీ బాయ్‌ను పరిచయం చేసుకుంది. "నా భర్త చనిపోయాడు, నేను ఒంటరిదాన్ని" అంటూ నమ్మించి, అతడిని గుడిలో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత తన తండ్రికి ఆపరేషన్ అని, ఇతర కారణాలు చెప్పి అనంతమూర్తి దగ్గర ఏకంగా 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. డబ్బు చేతికి అందగానే అతడికి కూడా షాక్ ఇచ్చి అక్కడి నుంచి చెక్కేసింది.

అనంతమూర్తిని వదిలేసిన ఈ మాయలేడి, ఇప్పుడు కనకపురకు చెందిన మరో వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఇలా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ, అమాయకపు పురుషులను మోసం చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. 

సుధారాణి చేతిలో మోసపోయిన మొదటి భర్త వీరేగౌడ, రెండో భర్త అనంతమూర్తి ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. "మాకు ఆమె వద్దు, మా డబ్బు మాకు ఇప్పించండి.. ఇలాంటి మోసగత్తెపై కఠిన చర్యలు తీసుకోండి" అని పోలీసులను వేడుకుంటున్నారు. ఈమె కేవలం పెళ్లిళ్లే కాకుండా మరికొంత మందిని కూడా ఆర్థికంగా మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు.

Also Read :  సైబర్ నేరాలు.. కోటిన్నర మొబైల్‌ నంబర్లు బ్లాక్‌ చేసిన కేంద్రం

Advertisment
తాజా కథనాలు