/rtv/media/media_files/2026/02/03/a-woman-jumps-into-hussain-sagar-in-hyderabad-2026-02-03-07-11-22.jpg)
A woman jumps into Hussain Sagar in Hyderabad
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తల్లికున్న వైకల్యం కారణంగా తనకు పెళ్లి జరగడం లేదని ఓ యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. చివరికి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన తోష్నివాల్ విజయలక్ష్మీ(26) ఉంటోంది. ఆమె తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. తల్లి సరస్వతికి మతిస్థిమితం సరిగా లేదు. వీళ్లు కూకట్‌పల్లి పరిధిలోని మైత్రినగర్‌లో ఉంటున్నారు.
Also Read: యోగి ఆధిత్యనాథ్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు బ్రేక్
దీంతో కూతురై తల్లికి అన్నీ తానై సపర్యలు చేస్తోంది. మరోవైపు ఓ కంపెనీలో కూడా ఉద్యోగం చేస్తోంది. అయితే ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధాలు వచ్చాయి. తల్లి తనతోపాటే ఉంటుందని ఆమె రూల్ పెడ్డటంతో ఎవరూ పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. శనివారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
Also Read: యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల బంగారం..వీడియో వైరల్..
ఆమె సమీప బంధువైన అభిషేక్ ఆదివారం పోలీసులకను ఆశ్రయించాడు. చివరికి హుసేన్‌సాగర్‌లో యువతి మృతదేహం తేలినట్లు గుర్తించారు. ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం కుకట్‌పల్లిలో అదృశ్యమైన విజయలక్ష్మిదేననే నిర్ధారణకు వచ్చారు. విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Follow Us