/rtv/media/media_files/2025/04/05/V0VvL4dDiQgNxIpW6EZn.jpg)
Uttarpradesh crime Photograph: (Uttarpradesh crime)
పీరియడ్స్ అనేది మహిళలకు సాధారణం. అయితే పీరియడ్స్ సమయంలో మహిళలు ఐదు రోజుల పాటు ఎలాంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదనే ఆచారం దేశంలో ఉంది. ఇలాంటి ఆచారం వల్ల ఓ వివాహిత మహిళ ప్రాణాలు తీసుకుంది. పీరియడ్స్ వల్ల నవరాత్రి వేడుకల్లో పాల్గొన లేకపోయానని దిగులు చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
ఇది కూడా చూడండి: Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!
Unable To Observe Navratri Due To Periods, UP Woman Dies By Suicide https://t.co/Z0dzeNlulJ
— NDTV News feed (@ndtvfeed) April 5, 2025
ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!
నవరాత్రుల వేడుకలను జరుపుకోలేదని..
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని ఝాన్సీ జిల్లాలోని పన్నా లాల్ గొల్లా కువాన్ ప్రాంతంలో ప్రియాంషా సోని అనే 36 ఏళ్ల మహిళ కుటుంబంతో కలిసి ఉంటుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సోనికి దుర్గాదేవి అంటే అమితమైన భక్తి. దీంతో ఛైత్ర మాసంలో వచ్చే నవరాత్రి వేడుకలను ప్రతీ ఏడాది నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది కూడా అలాగే నిర్వహించాలని, పూజకు కావాల్సిన సామాగ్రిని భర్తకు చెప్పి తీసుకొచ్చింది.
ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్ అరెస్టు
నవరాత్రులు ప్రారంభం అవుతాయంటే మొదటి రోజు ప్రియాంషాకి నెలసరి రావడంతో పూజలో పాల్గొనలేకపోయింది. ఇష్టమైన నవరాత్రుల వేడుకలను జరుపుకోలేకపోవడంతో బాగా కుంగిపోయి విషం తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకున్న తర్వాత ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ ఇంట్లో ఆరోగ్యం క్షీణించి ప్రియాంషా మృతి చెందింది.
ఇది కూడా చూడండి: Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?
latest-telugu-news | crime news | uttar-pradesh | telugu-news | today-news-in-telugu | national news in Telugu | telugu crime news