/rtv/media/media_files/2025/04/19/PGOx2kuvLVEWIBuKJPEz.jpg)
Nithiin and Venu Yellamma movie new heroine Keerthy Suresh
బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కమెడియన్ వేణు. జబర్దస్త్‌లో తన కామెడీతో ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించిన అతడు.. తన బలగం సినిమాతో మాత్రం యావత్ తెలుగు ప్రజలను ఏడిపించేశాడు. ఈ సినిమా సూపర్ హిట్‌తో వేణు పేరు మారుమోగిపోయింది. టాలెంట్ ఎవరి సొత్తూ కాదని అతడు నిరూపించాడు. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి నిర్మాత దిల్‌రాజుకు లాభాలు తెచ్చిపెట్టింది.
Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
ఈ సినిమా హిట్ తర్వాత వేణు ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. అదే ‘ఎల్లమ్మ’. ముందుగా నేచురల్ స్టార్ నాని ఈ మూవీలో హీరోగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అనివార్య కారణాల వల్ల అతడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఈ స్టోరీ అటు ఇటు తిరిగి హీరో నితిన్ వద్దకు వచ్చింది. అతడికి ఈ మూవీ స్టోరీ వినిపించగా.. ఓకే చెప్పేశాడు.
Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్ టికెట్లు!
సాయి పల్లవి ఔట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి అతుల్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రూరల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నితిన్ మునుపెన్నడూ లేని పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నితిన్ సరసన హీరోయిన్‌గా సాయి పల్లవిని సెలెక్ట్ చేసినట్లు జోరుగా ప్రచారం నడిచింది. కానీ తాజాగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు
మరొక స్టార్ హీరోయిన్
ఆమె ప్లేస్‌లో ఇప్పుడు మరొక స్టార్ హీరోయిన్‌ను తీసుకున్నట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు.. కీర్తి సురేష్. ఈ మూవీలో హీరోయిన్‌గా ఈమెను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి నో చెప్పడంతో కీర్తి సురేష్‌ను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు నితిన్‌క జోడీగా కీర్తి సురేష్ ‘ఎల్లమ్మ’ మూవీలో నటిస్తుందన్న మాట. అయితే దీనిపై మేకర్స్ అఫీషియల్ అప్డేట్‌ను త్వరలో ఇవ్వనున్నారు.
Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!
nithiin | balagam-director-venu | Yellamma movie