/rtv/media/media_files/2025/04/19/NVQHMxUFMgPGrDGei74i.jpg)
Harish Rao emotional
Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ఓ చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రి చనిపోయిన కష్టపడి చదువుకుంటున్న ఆ చిన్నారి బాధ చూసి భావోద్వేగానికి గురయ్యారు. అయితే మంత్రి హరీష్ రావు తాజాగా సిద్దిపేటలోని ఓ స్కూల్ లో 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి' అనే అవగాహన సదస్సు కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ సాత్విక అనే చిన్నారి స్టేజ్ పై తన ఫ్యామిలీ పరిస్థితి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. తన చిన్నవయసులోనే నాన్న చనిపోయాడని.. అమ్మే తనని కష్టపడి చదివిస్తుందని ఎమోషనల్ అయ్యింది. ఆ చిన్నారి కథ విని హరీష్ రావు కూడా కంటతడి పెట్టుకున్నారు. నాన్న లేడని వెక్కివెక్కి ఏడుస్తున్న సాత్వికను ఓదార్చి.. దైర్యం చెప్పారు. చిన్నారి బాధ చూసి.. హరీష్ రావుతో పాటు కార్యక్రమంలో అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.
తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2025
తండ్రి చనిపోయాడని.. తన తల్లి కష్టపడి చదివిస్తుందన్న ఓ చిన్నారి కథ విని స్టేజి పైనే కంటతడి పెట్టుకుని.. చిన్నారిని ఓదార్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్… pic.twitter.com/49x2DokEC4
latest-news | telugu-news | harish-rao | BRS Harish Rao