Diabetes: టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు

నేటికాలంలో ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలి, వంశపారంపర్యత, ఊబకాయం టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఈ సమస్యలు ముందు మూత్ర విసర్జన, హఠాత్తుగా బరువు తగ్గడం, ఎక్కువ ఆకలి, దాహం అనిపించడం, చేతులు, కాళ్లలో తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

New Update

Diabetes: మధుమేహం అనే వ్యాధి మొదట్లో సాధారణంగా కనిపించినా దీర్ఘకాలంగా చూస్తే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకూ కారణమవుతుంది. ఇది శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం లేదా ఇన్సులిన్‌ను సరిగ్గా వినియోగించ లేకపోవడం వల్ల వస్తుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి శరీరాన్ని హానికరంగా ప్రభావితం చేస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, నిశ్చల జీవనశైలి, వంశపారంపర్యత, ఊబకాయం, కొంతమంది మందులు లేదా ఇతర ఆరోగ్య పరిస్థితులు కావచ్చు. దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

గర్భధారణ సమయంలో..

డయాబెటిస్ అనేది ఒక్కసారిగా వచ్చే సమస్య కాదు. దీని లక్షణాలు ముందుగానే తెలుస్తాయి. సరిగ్గా గుర్తించకపోతే, దీర్ఘకాలిక సమస్యలుగా మారే అవకాశం ఉంది. మధుమేహం ప్రధానంగా టైప్ 1, టైప్ 2, గర్భధారణ మధుమేహంగా మూడు రకాలుగా ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. తరచుగా చిన్న వయసులో కనిపిస్తుంది. టైప్ 2 మాత్రం సంవత్సరాల పాటు నెమ్మదిగా పెరిగి ఎక్కువగా పెద్దలలో కనిపిస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్ ప్రసవం తర్వాత తగ్గిపోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో కొనసాగవచ్చు. మధుమేహానికి వచ్చే ముందు శరీరంలో కొన్ని హెచ్చరిక సంకేతాలు ఉంటాయి.

ఇది కూడా చదవండి: గంధం రాసుకుంటే కలిగే ప్రయోజనాలు

ఉదాహరణకు తరచుగా మూత్ర విసర్జన, హఠాత్తుగా బరువు తగ్గడం, ఎక్కువ ఆకలి లేదా దాహం అనిపించడం, చేతులు, కాళ్లలో తిమ్మిరి లేదా నొప్పి రావడం, దృష్టి అస్పష్టత వంటి లక్షణాలు కనిపిస్తాయి.  ఇవన్నీ శరీరం ఇచ్చే సంకేతాలు. కానీ చాలామంది ఇవి సాధారణం అనుకుని పట్టించుకోరు. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా, తొలినాళ్లలోనే గమనించి తగిన వైద్యం తీసుకోవడం ద్వారా మధుమేహం ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార నియమాలు, నిత్య వ్యాయామం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: 30 ఏళ్ల తర్వాత రొమ్ము పరిమాణాన్ని పెంచడం సాధ్యమేనా?

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment