ప్రస్తుతం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. అందరూ కూడా ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపుతున్నారు. కానీ ఇలాంటి సమయంలో మహారాష్ట్ర (Maharashtra) లో ఓ విషాదం చోటుచేసుకుంది. తండ్రి కొత్త ఫోన్ కొనివ్వలేదని ఓ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు చావును చూడలేని తండ్రి అదే తాడుతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జరిగింది. ఇది కూడా చూడండి: Sankranthi Muggulu 2025: భోగి పండగకు ఈజీగా కుండల డిజైన్స్ .. 5 నిమిషాల్లోనే వేయిండిలా! మొబైల్ ఫోన్ కొనివ్వలేదని.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాందేడ్‌లోని ఓంకార్ అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. దీని కోసం స్మార్ట్‌ఫోన్ (Smartphone) కావాలని తండ్రికి అడిగాడు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవని తండ్రి మొబైల్ కొనివ్వకపోవడంతో మనస్థాపం చెంది పొలంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కూడా చూడండి: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా? ఎంత సమయం అయిన కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి వెళ్లి చూసేసరికి చనిపోయి కనిపించాడు. తీవ్ర ఆవేదన చెందిన తండ్రి వెంటనే అదే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో తండ్రి కొడుకులు ఒకేసారి చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది కూడా చూడండి:Sankranthi Rangavalli 2025: సంక్రాంతికి సింపుల్ గా సూపర్ ముగ్గు.. 5 నిమిషాల్లోనే వేయిండిలా! ఇదిలా ఉండగా ఇటీవల కొండపోచమ్మ సాగర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ కోసం నీటిలో దిగిన 7గురు యువకుల్లో ఐదుగురు అందులోనే ముగిని చనిపోయారు. మరో ఇద్దరు తృటిలో బయటపడ్డారు. మృతులంగా హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మార్కూర్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈతకొట్టేందుకు ఏడుగురు వెళ్లారు. నీళ్లలోకి దిగి సరదాగా ఆడుతుండగా ప్రమాదవశాత్తూ ఐదుగురు నీట మునిగి అక్కడిక్కడే మరణించారు. మిగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలియగానే స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఇది కూడా చూడండి: Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్!