ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఓటమి నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో నైనా గెలవాలని అభిమానులు భావిస్తున్న టైమ్ లో బుమ్రా... మ్యాచ్ లన్నీ మిస్ కావచ్చు తెలుస్తోంది. వెన్నులో వాపు కారణంగా బుమ్రా స్టేజ్ లోని మ్యాచ్ లన్నీ అడకపోవచ్చునని సమాచారం. అప్పటికే కోలుకుంటే ఓకే కానీ లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం అతడు దూరమయ్యే అవకాశం ఉంది. అతడి ఫిటెనెస్ విషయంలోనే బీసీసీఐ జట్టును ప్రకటించేందుకు సంకోచిస్తుందని, అందుకే ఐసీసీని మరింత సమయం అడిగినట్లుగా తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమయ్యే సమయానికి బుమ్రా ఫిట్‌గా ఉండే అవకాశం లేదని సమాచారం. కాగా 5-మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై 32 వికెట్లు తీసిన బుమ్రా ఆఖరి టెస్టులో వెనుక నొప్పి కారణంగా మ్యాచ్ నుండి వైదొలగాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం యొక్క మొదటి గ్రూప్ మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరుగుతుంది, ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో హై-స్టేక్స్ ఢీకొంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా చివరి గ్రూప్ మ్యాచ్ మార్చి 02న జరగనుంది. మార్చి 04, 05 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరగనుండగా, మార్చి 09న ఫైనల్ జరగాల్సి ఉంది.
ఇంగ్లాండ్‌తో 5 టీ20ల సిరీస్‌కు భారత తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది.15 మంది సభ్యులతో కూడిన లిస్టు రిలీజ్ చేసింది. స్టార్ పేసర్ మహ్మద్ షమీ చోటు దక్కించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సారథిగా జనవరి 22 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది.
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (సి), సంజు శాంసన్ (వికెట్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ , వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్.
Also Read : రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల