Sankranthi Rangavalli 2025: సంక్రాంతికి సింపుల్ గా సూపర్ ముగ్గు.. 5 నిమిషాల్లోనే వేయిండిలా! సంక్రాంతి అనగానే ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు దర్శనమిస్తాయి. అయితే ముగ్గు వేయడం కష్టంగా ఉన్నవారికి ఇక్కడ కొన్ని సింపుల్ డిజైన్స్ ఉన్నాయి. చూసి ట్రై చేయండి. By Archana 08 Jan 2025 | నవీకరించబడింది పై 13 Jan 2025 08:04 IST in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 సంక్రాంతి పండగ వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు దర్శనమిస్తాయి. మగువలు ఇంటి ముందు అందమైన రంగవల్లులతో రోజుకో ముగ్గు వేసి మురిసిపోతుంటారు. అయితే ఇక్కడ మీ కోసం కొన్ని సింపుల్, అందమైన డిజైన్స్ ఉన్నాయి. చూసి ట్రై చేయండి. 2/7 సిర్కిల్స్, ఆకులు, దీపాల డిజైన్స్ తో కూడిన ఈ ముగ్గు ఇంటి ముందు ఎంతో అందంగా కనిపిస్తుంది. వేయడానికి కూడా ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. 3/7 పొంగలి కుండ, భోగి మంటలు, చెరుకు గడలతో కూడిన ఈ డిజైన్ సంక్రాంతి పండగ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. 4/7 కమలం పువ్వు ఆకారంలో ఒక చిన్న పొంగలి కుండ ఉన్న ఈ చాలా చిన్నగా, సింపుల్ గా, అందంగా ఉంటుంది. పెద్ద పెద్ద ముగ్గులు వేయడం రానివారు దీనిని సింపుల్ గా వేయవచ్చు. 5/7 మగువ చేతిలో కొత్తగా కోసిన పంట, పొంగలి కుండ, గంగిరెద్దులు, బోగిమంటలతో కలగలిపిన ఈ డిజైన్ ఇంటి ముందు పండగ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తుంది. 6/7 నెమలి, చెరుకు గడలు, పొంగలి కుండలతో కూడిన ఈ ముగ్గు అందంగా ఉంటుంది. 7/7 ముగ్గు అందంగా కనిపించాలంటే ముందు చుక్కలు సరిగ్గా పెట్టాలి. లేదంటే ముగ్గు పాడవుతుంది. ముగ్గులో ప్రతి చుక్క సరైన దూరంలో ఉండేలా పెట్టాలి. అప్పుడే ముగ్గు అందంగా కనిపిస్తుంది. #telugu-news #sankranthi 2025 #Rangoli Designs 2025 #latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి