/rtv/media/media_files/2025/01/11/yEmFByO1oHuklVCNSPes.jpg)
bhogi pallu
Bhogi Pallu: సంక్రాంతి అంటేనే రైతుల పండగ. ప్రతి ఇళ్ళు ధాన్యరాశులతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కనుల విందుగా జరుగుతాయి. అయితే బోగి పండగ రోజున పిల్లల తలపై భోగి పళ్ళు పొసే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అసలు భోగినాడు పిల్లల మీద భోగి పళ్ళు ఎందుకు పోస్తారు..? ఇలా చేయడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్.. అమెరికాలో ఏం జరుగుతోంది?
భోగి పళ్లు ఎందుకు పోస్తారు..?
అయితే భోగి నాడు పిల్లల తల మీద భోగి పళ్ళు పోయడం ద్వారా చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు దీనికి ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందట. భోగి పండ్లు పోసి దానిని ప్రేరేపించడం ద్వారా పిల్లల జ్ఞానం పెరుగుతుందని భావిస్తారు. రేగుపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను కలిపి భోగి పండ్లుగా పిల్లల తలపై పోస్తారు. ఎరుపు రంగులో ఉండే ఈ రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. తద్వారా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగి పళ్ళను పోస్తారు.
Also Read: USA: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా
పురాణాల ప్రకారం..
పురాణాల ప్రకారం.. అప్పట్లో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు బదరికావనంలో తప్పస్సు చేస్తూ ఉన్నారట. అయితే ఆ సమయంలో దేవతలు వారి తలలపై బదరీ ఫలాలను కురిపించారట. ఆ సంఘటనకు ప్రతీకగా చిన్న పిల్లలను నారాయణుడిగా భావించి.. వారి తలలపై భోగి పళ్ళు పొసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Game Changer: బాబూ శంకరూ... ఇంకా అదే పాత చింతకాయి పచ్చడి అయితే ఎలా? రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఆవేదన
Follow Us