Sankranthi Muggulu 2025: సంక్రాంతి అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు. ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు దర్శనమిస్తాయి. మగువలు రోజొక్క తీరు ముగ్గుతో తమ ముంగిలిని అందంగా ముస్తాబు చేస్తారు. కొందరు చుక్కల ముగ్గులు వేస్తే మరికొందరు డిజైన్ ముగ్గులు వేస్తుంటారు. ఇక సంక్రాంతి రాగానే సోషల్ మీడియాలో అంతా రకరకాల డిజైన్స్, చుక్కలు ముగ్గులతో నిండిపోయి ఉంటుంది. సంక్రాంతికి ఎక్కువగా ధాన్యం కుండలు ఉన్న ముగ్గులు వేస్తుంటారు. వీటితో పాటు చెరుకు గడలు ఉండే విధంగా రెండింటిని కలిపి సంక్రాంతి వెలుగులు వచ్చేలా రంగవల్లికలు వేస్తారు. ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా MUGGU Also Read : 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ భోగి కుండలు డిజైన్ .. ఈ క్రమంలో సంక్రాంతి థీమ్ నేపథ్యంలో వేసిన ఓ ముగ్గు నెట్టింట తెగ వైరలవుతోంది. కేవలం 5 చుక్కలు 5 వరుసలతో ఒక అబ్బాయి వేసిన ఈ డిజైన్ అందరినీ ఆకట్టుకుంటుంది. భోగి కుండలు, గంగిరెద్దులు, చెరుకు గడలు ఇలా సంక్రాంతిని ప్రతిభింభించే అంశాలతో ఎంతో అందంగా ఉంది. పెద్ద డిజైన్స్ తో ముగ్గులు వేయలేని వారు.. సింపుల్ గా ఈ ముగ్గు ట్రై చేయవచ్చు. మధ్యలో సంక్రాంతి కుండ వేస్తూ.. దాని చుట్టూ గంగిరెద్దు వచ్చేలా డిజైన్ వేశాడు. ఈ కింది వీడియోలో చూపించిన విధంగా స్టెప్స్ ఫాలో అయ్యారంటే .. కేవలం 5 నిమిషాల్లోనే మీ ముగ్గు సిద్దమవుతుంది. View this post on Instagram A post shared by Gollapudi Savithri (@kodavati6) Also Read: చంపడంలో పీహెచ్‌డీ.. మర్డర్లలో మాస్టర్స్ చేశా.. డాకు మహారాజ్ ఊరమాస్ రిలీజ్ ట్రైలర్!