Crime: హైదరాబాద్‌లో మరో డిజిటల్ అరెస్ట్.. మహిళా ప్రొఫెసర్‌ నుంచి రూ. కోట్లు దోచేసిన కేటుగాళ్లు!

హైదరాబాద్‌లో మరో డిజిటల్ అరెస్ట్ ఫేక్ కేసు నమోదైంది. మేడ్చల్‌కు చెందిన రిటైర్డ్ మహిళా ప్రొఫెసర్‌ను భయపెట్టి రూ.1.60 కోట్లు దోచేశారు సైబర్‌ నేరగాళ్లు. బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

New Update
digital arrest

Hyderabad Another digital arrest fake case

హైదరాబాద్‌లో మరో డిజిటల్ అరెస్ట్ ఫేక్ కేసు నమోదైంది. మేడ్చల్‌కు చెందిన రిటైర్డ్ మహిళా ప్రొఫెసర్‌ను భయపెట్టి రూ.1.60 కోట్లు దోచేశారు సైబర్‌ నేరగాళ్లు. దీంతో ఆలస్యంగా మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read :  భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం

పాస్‌పోర్టు క్యాన్సిల్ చేస్తామంటూ..

ఈ మేరకు మేడ్చల్‌కు చెందిన రిటైర్డ్ మహిళా ప్రొఫెసర్‌(78)కు ఢిల్లీ సైబర్‌క్రైమ్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ ఇటీవల వాట్సప్‌ వీడియో కాల్‌ వచ్చింది. మనీలాండరింగ్‌ అభియోగాలపై ఈడీ కేసు నమోదు చేసిందని కేటుగాళ్లు నమ్మించారు. అయినా తానేమీ చేయలేదని చెప్పినా అనుమానితుల జాబితాలో ఉన్నారంటూ భయాందోళనకు గురిచేశారు. సీబీఐ అధికారులతో మాట్లాడాలంటూ మరో వ్యక్తికి కాల్‌ కలిపి బయపెట్టారు. అతను విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్టు క్యాన్సిల్ చేస్తామని బెదిరించాడు. బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని అడిగాడు. దీంతో వెంటనే ఆమె పంపించింది. 

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

ఆ తర్వాత రిజర్వు బ్యాంకు తనిఖీ పూర్తయ్యే వరకు డబ్బు తమకు పంపాలని చెప్పారు. ట్రాయ్, సీబీఐ, ఢిల్లీ ఆర్థిక శాఖతో ఒప్పందం చేసుకున్నట్లు ఒక పేపరు పంపించారు. అంతేకాదు తాము చెప్పిన రూల్స్, చట్టాలను ఉల్లంఘిస్తే జైలుశిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తామన్నారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్‌ చేసి మరింత డబ్బు పంపించాలని బెదిరించడతో బంధువు దగ్గర అప్పు చేసి 7 విడతల్లో రూ.60 లక్షలు పంపించింది. చివరికి ఈ విషయం స్నేహితులతో చెప్పడంతో మోసం జరిగినట్లు గుర్తించి సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.  

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

Also Read :  విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

 

today telugu news | lady professor | digital arrest | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telangana crime incident | telangana crime news | telangana-crime-updates | latest telangana news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు