Cyber Crime : స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మహిళకు టోకరా...రూ.2.7 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

చంపాపేటకు చెందిన 57 ఏళ్ల గృహిణి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.7 కోట్లు పోగొట్టుకుంది. సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాదారులుగా నటిస్తూ ఆమెనుంచి డబ్బులు కాజేశారు. సంస్థాగత స్టాక్‌లలో పెట్టుబడి పెట్టమని ఒప్పించి పెద్దమొత్తంలో దోచుకున్నారు.

New Update
Telangana CYBER Crime

Cyber Crime : చంపాపేటకు చెందిన 57 ఏళ్ల గృహిణి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.7 కోట్లు పోగొట్టుకుంది. సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాదారులుగా నటిస్తూ ఆమెనుంచి డబ్బులు కాజేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎల్ఎల్బీ గ్రాడ్యుయేట్ అయిన బాధితురాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టాక్ పెట్టుబడిపై ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటనను చూసింది. దానిపై క్లిక్ చేసినప్పుడు, ఆమెను 'ఐడియల్ ఇన్వెస్ట్‌మెంట్ గైడ్6' అనే వాట్సాప్ గ్రూప్‌కు మళ్లించారు. ఈ గ్రూపును నేహా అగర్వాల్ అనే పేరు అడ్మిన్ గా ఉండి నడుపుతున్నారని తేలింది.'stocks.bxtrade-pro.top' అనే వెబ్‌సైట్. బిక్స్-ట్రేడ్ అనే ట్రేడింగ్ యాప్ ద్వారా మోసగాళ్ళు బాధితురాలిని ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPOలు), ఓవర్-ది-కౌంటర్ (OTC) స్టాక్‌లు, సంస్థాగత స్టాక్‌లలో పెట్టుబడి పెట్టమని ఒప్పించారు. దీంతో వారు చెప్పినట్టే చేసింది.  

Also Read: లండన్‌లో భారత జెండాను అవమానించిన అల్లరి మూకలు.. కాళ్ల కింద నలిపేసిన వీడియో

 అయితే ఆ తర్వాత ఆమె తన డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, మోసగాళ్ళు సర్వీస్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో అదనపు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో మార్చి 19 నుంచి ఏప్రిల్ 29 మధ్య, బాధితురాలు 15 లావాదేవీలలో మొత్తం రూ.2.7 కోట్లను మోసగాళ్ళు సూచించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. రూ.2.7 కోట్లలో, ఆమె ఏప్రిల్ 23 నాటికి రూ.1.7 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు,  సదరు యాప్ లో ఆమె మొత్తం ఆదాయాన్ని రూ.8.45 కోట్లుగా చూపించింది. బాధితురాలు ఆ డబ్బును విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు, మోసగాళ్ళు ఏప్రిల్ 29న వివిధ ఛార్జీల కోసం ఆమెకు రూ.1 కోటి కంటే కొంచెం ఎక్కువ చెల్లించమని బలవంతం చేశారు. వారు మరో రూ.1.8 కోట్లు అడుగుతుండడంతో అనుమానం వచ్చింది.చివరికి అది స్కామ్ అని ఆమె గ్రహించి శుక్రవారం రాచకొండ పోలీసులను ఆశ్రయించింది."దుండగులు విత్‌డ్రాలకు మరిన్ని డబ్బులు అడుగుతూనే ఉండటంతో తాను మోసపోతున్నానని ఫిర్యాదుదారు గ్రహించారని" అని రాచకొండకు చెందిన సైబర్ క్రైమ్ అధికారి ఒకరు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్లు 316(2), 319(2), 318(4), 338,ఐటీ చట్టంలోని సెక్షన్లు 66(C&D) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నేరస్థులను గుర్తించి, దొంగిలించబడిన నిధులను తిరిగి పొందడానికి సైబర్ క్రైమ్ యూనిట్ దర్యాప్తు ప్రారంభించింది.

Also Read: భారత్-పాక్ ఉద్రిక్తత.. క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్

వృద్ధుడి నుంచి రూ.54 లక్షలు..


మరో ఘటనలో కర్నూలుకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడినుంచి సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ముసుగులో రూ.54 లక్షలు దోచేశారు. కర్నూలుకు చెందిన ఎం.సుధిందర్‌రావు పంచాయతీరాజ్‌శాఖలో డీఈగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తే భారీ లాభాలు వస్తాయని, ఇందుకు ఒక గ్రూప్‌లో చేరాలంటూ గత ఏడాది ఆయన వాట్సప్‌నకు ఒక మెసేజ్‌ వచ్చింది. ఇందుకు కొంత డబ్బు కట్టాలని చెప్పగా ఆయన రూ.2 లక్షలను వారు సూచించిన సంస్థ ఖాతాకు పంపారు. ఆ తర్వాత సదరు గ్రూప్‌ నుంచి ఓ మహిళ ఫోన్‌ చేసి చెప్పడంతో ‘బీఆర్‌ బ్లాక్స్‌ మాక్స్‌’ అనే ట్రేడింగ్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. యాప్‌లో వచ్చిన సూచనల మేరకు బాధితుడు తన బ్యాంకు ఖాతా నుంచి 16 విడతల్లో వారు సూచించిన ఖాతాలకు నగదు పంపారు. తర్వాత ఆయన ట్రేడింగ్‌ ఖాతాకు రూ.9.26 కోట్లు జమ అయినట్లు సైబర్‌ నేరగాళ్లు తెలిపారు. వాటిని విత్‌డ్రా చేసుకోవాలంటే రూ.2 కోట్లు కట్టాలని చెప్పారు. అంత డబ్బు కట్టలేనని, తన నగదు ఇచ్చేయాలని పట్టుబట్టగా వారి నుంచి ఎలాంటి స్పందనా లేకపోయింది. తాను మోసపోయానని గుర్తించిన సుధిందర్‌రావు కర్నూలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్‌ నేరగాళ్లు మొత్తంగా రూ.54.44 లక్షలను దోచుకున్నారని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు