వారికి సెలవులు క్యాన్సిల్ చేయండి.. యుద్ధ వాతావరణంవేళ ఆర్మీ కీలక ప్రకటన!

దేశవ్యాప్తంగా బాంబులు, క్షిపణులు, గ్రెనేడ్లు, ల్యాండ్ మైన్స్, బుల్లెట్లు తయారు చేసే 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ MIL ప్రకటన జారీ చేసింది. మరో రెండు నెలల పాటు 2రోజుల కంటే ఎక్కువ సెలవులు ఎవరికీ ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు.

New Update
Munition India Limited

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌తో భారత్‌కు పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా మరో కీలక నిర్ణయం వెలుబడింది. దేశవ్యాప్తంగా బాంబులు, క్షిపణులు, గ్రెనేడ్లు, ల్యాండ్ మైన్స్, బుల్లెట్లు, వార్‌హెడ్‌లు తయారు చేసే 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉద్యోగుల, అధికారుల సెలవులు రద్దు చేస్తూ మునిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL) ప్రకటన జారీ చేసింది. మరో రెండు నెలల పాటు 2రోజుల కంటే ఎక్కువ సెలవులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దీర్ఘకాలిక సెలవులు పెట్టుకున్న వారి లీవ్స్ క్యాన్సల్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై తప్పని పరిస్థితిల్లో మాత్రమే అది కూడా 2 రోజుల కంటే ఎక్కువ లీవ్స్ ఉండవని ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు.

ఏప్రిల్ 22 తర్వాత ఉద్రిక్తతతో ఈ ఆదేశానికి సంబంధం లేదని బోర్డులోని వారితో సహా సీనియర్ మేనేజ్‌మెంట్ వర్గాలు ఖండించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చంద్రపూర్, జబల్‌పూర్ ల నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన గత నెల టార్గెట్ పూర్తి కాలేదని చెప్పారు. ఏప్రిల్ లో అనుకున్న ఆయుధ సామాగ్రి ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోలేదన్నారు. విదేశాలకు ఇవ్వవలసిన ఆర్డర్స్ అలాగే నిలిచిపోయాయని చంద్రపూర్ అధికారులు ప్రపంచ వెల్లడించారు. పహల్గామ్ దాడి తర్వాత తమ ఉద్యోగులను అలర్ట్ మోడ్ లో ఉంచినట్లు MIL తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు