Crime: పెళ్లి పెటాకులైందని బ్రోకర్‌ని చంపేసిన వరుడు

మధ్యవర్తి కుదిర్చిన వివాహం క్యాన్సల్ అయ్యిందని పెళ్లికొడుకు ఆగ్రహానికి గురైయ్యాడు. పెళ్లి చేసుకున్న మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపంతో రగిలిపోయిన వ్యక్తి పెళ్లి బ్రోకర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు.

New Update
Man Stabs Karnataka Matchmaker

Man Stabs Karnataka Matchmaker

మధ్యవర్తి కుదిర్చిన వివాహం క్యాన్సల్ అయ్యిందని పెళ్లికొడుకు ఆగ్రహానికి గురైయ్యాడు. పెళ్లి చేసుకున్న మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపంతో రగిలిపోయిన వ్యక్తి పెళ్లి బ్రోకర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి ఇద్దరు కుమారులు కూడా కత్తి దాడిలో గాయపడ్డారు. కర్ణాటకలోని మంగళూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వామంజూర్‌ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల సులేమాన్ పెళ్లి సంబంధాలు చూసే మధ్యవర్తి. తన బంధువైన 30 ఏళ్ల ముస్తఫాకు షహీనాజ్ అనే మహిళతో పెళ్లి సంబంధం కుదిర్చాడు. ఎనిమిది నెలల కిందట వారిద్దరికి పెళ్లి జరిగింది.

Also Read :  ఈ ఎల్లో ఫ్రూట్ చిన్న ముక్క తీసుకుంటే.. ఆరోగ్యం మీ సొంతం

Also Read :  పాక్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్

Groom Kills Mediator After Wedding

పెళ్లైన రెండు నెలలకే ముస్తఫా పెళ్లి పెటాకులైంది. భార్య షహీనాజ్ అతడ్ని వదిలి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆ పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తి సులేమాన్‌పై ముస్తఫా కోపంతో రగిలిపోయాడు. ఈక్రమంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మే 21న రాత్రి వేళ సులేమాన్‌కు ముస్తఫా ఫోన్‌ చేశాడు. అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో సులేమాన్‌ తన ఇద్దరు కుమారులు రియాబ్‌, సియాబ్‌తో కలిసి వాలాచిల్‌లోని ముస్తఫా ఇంటికి చేరుకున్నాడు. అక్కడ వారితో ముస్తఫాకు ఘర్షణ జరిగింది. ఆవేశంలో ముస్తఫా సులేమాన్‌ మెడపై కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. అడ్డువచ్చిన సులేమాన్ కుమారులపై కత్తితో దాడి చేశాడు.

Also Read :  ఈ 6 అలవాట్లతో మీ శరీరంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయ్!

Also Read :  వంటింట్లో ఉండే దీన్ని తీసుకుంటే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్

 

bride-groom | latest-telugu-news | telugu crime news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు