/rtv/media/media_files/2025/03/29/healthyperson2-155059.jpeg)
Health
అందరి వంటింట్లో అల్లం తప్పకుండా ఉంటుంది. దీన్ని డైలీ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఐరన్, కాల్షియం, అయోడిన్, క్లోరిన్, విటమిన్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అల్లం ఎలా తీసుకుంటే మిగతా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: BIG BREAKING: రేవంత్ రెడ్డికి బిగ్‌షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్
అసిడిటీ
అల్లం వల్ల గుండెల్లో మంట సమస్య అసిడిటీ సమస్య తగ్గుతుంది. రోజుకి ఒక కప్పు అల్లం రసం తాగడం వల్ల అసిడిటీ సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
వికారం, వాంతులు
అల్లం ఉదయం తీసుకోవడం వల్ల వికారం, వాంతులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని తగ్గించడంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చూడండి: Student Suicide News: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!
జీర్ణక్రియ
అల్లంలో జింజెరాల్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
కీళ్ల నొప్పులు
అల్లంలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కలిగిస్తాయి.
ఇది కూడా చూడండి: Miss World 2025: టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతగా మిస్ ఇండోనేసియా.. నృత్యాలు, పాటలతో మారుమోగిన మిస్ వరల్డ్ వేదిక
రోగనిరోధక శక్తి
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Israel Couple: కొన్ని రోజుల్లో నిశ్చితార్థం..అంతలోనే ఉగ్రవాదుల చేతుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి
immunity-power | health-benefits | ginger