/rtv/media/media_files/iK903Q1JyTjReI9a3Ezf.jpg)
Pine Apple
వేసవిలో మాత్రమే లభ్యమయ్యే పైనాపిల్ పండు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, పొటాషియం, ఫోలేట్, ఫైబర్ వంటి అనేక పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకి చిన్న ముక్క పైనాపిల్ తీసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి.
ఇది కూడా చూడండి: Student Suicide News: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!
గుండె ఆరోగ్యం
పైనాపిల్ డైలీ చిన్న ముక్క తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు వంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే పైనాపిల్ వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: రేవంత్ రెడ్డికి బిగ్‌షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్
పేగు ఆరోగ్యం
పైనాపిల్‌లోని పోషకాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, పేగు సమస్యలను తగ్గిస్తాయి. అలాగే మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Miss World 2025: టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతగా మిస్ ఇండోనేసియా.. నృత్యాలు, పాటలతో మారుమోగిన మిస్ వరల్డ్ వేదిక
రోగనిరోధక శక్తి
పైనాపిల్‌లో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఈ పైనాపిల్ సాయపడుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.