/rtv/media/media_files/2025/07/03/mumbai-school-teacher-arrested-for-sexually-assaulting-16-years-old-boy-2025-07-03-10-26-52.jpg)
Mumbai school teacher arrested for sexually assaulting 16 years old boy
మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఓ 16 ఏళ్ల విద్యార్థిపై ఉపాధ్యాయురాలు(40) పదేపదే లైంగిక వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. చివరికీ పాఠశాలలో పరీక్షలు పూర్తయి, ఆ బాలుడు వెళ్లిపోయిన కూడా ఆమె వదల్లేదు. లైంగిక వేధింపులకు పాల్పడుతూనే ఉంది. చివరికీ ఈ విషయం బాధితుడి తల్లిదండ్రులకు తెలియడంతో వాళ్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఉపాధ్యాయురాలిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Also Read: అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 5గురు మృతి - అందులో నలుగురు చిన్నారులు
Mumbai School Teacher Arrested For Sexually Assaulting
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఆ నిందితురాలు ఇంగ్లీష్ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే 2023 డిసెంబర్‌లో పాఠశాల వార్షిక వేడుకలు జరిగాయి. ఆ సయమంలో ఓ విద్యార్థితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆమెకు అప్పటికే పెళ్లయిపోయింది. అయినా కూడా లెక్కచేయకుండా అతడిని ఆకర్షించేందుకు ఆ టీచర్ ప్రయత్నాలు చేసింది. ఖరీదైన హోటళ్లకు తీసుకెళ్లి అతడిపై లైంగిక వేధింపులకు పాల్పడేది.
Also Read: ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. మరిదిలతో అక్రమ సంబంధం
కొన్నిరోజులుగా బాలుడి ప్రవర్తనలో మార్పు రావడంతో అతడి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఆ బాలుడిని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. కానీ పదో తరగతి కొద్ది రోజుల్లోనే పూర్తి కావాల్సి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. చివరికి ఇంట్లో పనిచేసే సిబ్బందితో ఆ టీచర్ అబ్బాయికి కబురు పంపించింది. ఇది ఉపేక్షించని తల్లిదండ్రులు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆమె స్నేహితుడిపై కూడా కేసు పెట్టారు.
Also Read: ఆఫ్రికాలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
Also Read : ఎవరికీ భయపడేది లేదు.. కొండా మురళి సంచలన కామెంట్స్
telugu-news | rtv-news | maharashtra | rape | national-news