/rtv/media/media_files/2025/01/28/F84UXyQn9pNJIJZ4Tpv6.webp)
AP Nellore Engineering student murder
AP Crime News: ఏపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో ఘోరం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు వాగులో ఓ యువతి మృతదేహం కలకలం రేపుతోంది. స్థానికులు సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆ యువతి ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినిగా గుర్తించారు. బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన లేహానెస్సిగా నిర్థారించారు. విద్యార్థినిని హత్య చేశారా? లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి
యువతి మిస్సింగ్ కేసు..
ఆమె కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాలు మాత్రం హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఇక పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఇక జనవరి 21న సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్‌లో యువతి మిస్సింగ్ కేసు కూడా నమోదు అయినట్లు తెలుస్తోంది. కళాశాలకు అని చెప్పి వెళ్లిన విద్యార్థిని గూడూరు పంబలేరు వాగులో శవమై తేలడంతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక విద్యార్థిని మృతి పట్ల ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో కళాశాల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఆమె మరణానికి గల కారణం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Siddipet Incident: తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కరువుపని.. సిద్దిపేటలో పెను విషాదం!
ఇదిలా ఉంటే.. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి (Puttaparthi) నియోజకవర్గంలో బుధవారం అర్ధరాత్రి వరుస దొంగతనాలతో దొంగలు (Thievs) హల్చల్ చేశారు. కొత్తచెరువు , ఓబుల దేవర చెరువు మండల కేంద్రాల్లో నాలుగు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. కొత్తచెరువు ప్రధాన రహదారిపై ఉన్న దర్గా షాపింగ్ కాంప్లెక్స్ లో రెండు దుకాణాలతో పాటు బాబు కిరాణా షాప్ లో రూ. 20 వేల నగదు, రూ.30 వేలు విలువచేసే సిగరెట్లు ఎత్తుకెళ్లారు. సాయినాథ్ షాప్ లో సిగరెట్ బండీల్ తో పాటు రూ. లక్షా యాభైవేల నగదు చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Siddipet Incident: తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కరువుపని.. సిద్దిపేటలో పెను విషాదం!
ఇది కూడా చూడండి: తస్సాదియ్యా మామూలోడు కాదయ్యా సిరాజ్ : ఆమెతో కాదు.. ఈమెతో డేటింగ్!