B Pharmacy Student Murder: నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతకం..బీ ఫార్మసీ విద్యార్థినిని కత్తితో పొడిచి..
నెల్లూరులో బీ ఫార్మసీ విద్యార్థిని మైథిలిప్రియను ఆమె స్నేహితుడు నిఖిల్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కరెంట్ఆఫీస్ సెంటర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాట్లాడాలని పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిఖిల్ అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.