దారుణం.. 90 ఏళ్ల వృద్ధురాలిపై గ్యాంగ్ రేప్

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. గుడిసెలో ఒంటరిగా ఉన్న 90 ఏళ్ల వృద్ధురాలిపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వృద్ధురాలి కూతురు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది.

New Update
90 Year Old Woman Raped By 4 Masked Men In Madhya Pradesh

90 Year Old Woman Raped By 4 Masked Men In Madhya Pradesh

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. గుడిసెలో ఒంటరిగా ఉన్న 90 ఏళ్ల వృద్ధురాలిపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వృద్ధురాలి కూతురు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఖాండ్వా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు పొలంలోని ఓ గుడిసెలో ఉంటోంది. 

Also Read: పురుషుల కన్నా మహిళలే తెలివైనవారు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

అయితే మార్చి 5న రాత్రిపూట ఆ ప్రదేశానికి ముసుగులు వేసుకొని నలుగురు వ్యక్తులు వచ్చారు. గుడిసెలో ఉన్న ఆ వృద్ధురాలిపై గ్యాంగ్ రేప్‌ చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాతి రోజు వేరే గ్రామంలో ఉంటున్న తన కూతురుకు వృద్ధురాలు ఈ విషయం చెప్పింది. దీంతో కూతురు తల్లిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి సిబ్బంది సూచనలతో పోలీసలకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.  

Also read: జేడీ(యూ)లో చేరిన నీతీశ్‌ కుమారుడు నిశాంత్‌

విచారణ కోసం అదనపు ఎస్పీ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. నిందితులను అరెస్టు చేసేందుకు మూడు పోలీస్ టీమ్‌లు గాలింపిు చర్యలు చేపట్టాయి. నిందితుల గురించి తమకు సమాచారం ఇచ్చినవాళ్లకి పోలీసులు రూ.10 వేల రివార్డును ప్రకటించారు. వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా దుమారం రేపుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని అక్కడివారు డిమాండ్ చేస్తున్నారు.  

Advertisment
తాజా కథనాలు