/rtv/media/media_files/2026/03/08/bihar-2026-03-08-21-48-33.jpg)
Villagers shave Bihar man's head, parade him for molesting mute woman
బిహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూగ మహిళను లైంగికంగా వేధించిన వ్యక్తిని గ్రామస్థులు కఠిన శిక్ష విధించారు. అతడికి గుండు గీయించి ఊరంతా ఊరేగించారు. రూ.5,001 జరిమానా విధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్‌పూర్ జిల్లాలో ఔరై గ్రామంలో ఓ మూగ మహిళ ఉంది. ఓ వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించాడు.
Also Read: కేంద్రం బంపరాఫర్.. లోగో డిజైన్ చేస్తే రూ.50 వేలు
దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. గ్రామస్థులు ఈ ఘటనపై మీటింగ్ నిర్వహించారు. ఆ నిందితుడికి బహిరంగంగా శిక్ష విధించారు. గుండు గీయించి.. గ్రామమంతా ఊరేగించారు. రూ.5,001 జరిమానా విధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గ్రామస్థులు చేసిన పని పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో వాళ్లు ఆ గ్రామానికి చేరుకుని ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బిగ్ షాక్.. 47 మంది పార్టీ లీడర్లకు జైలు శిక్ష
మరోవైపు నిందితుడికి గ్రామస్థులు విధించిన శిక్షను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మహిళలను వేధించేవాళ్లకు ఇలా శిక్షలు విధిస్తేనే అలాంటి పనులు చేసేందుకు భయపడుతారని చెబుతున్నారు.
Follow Us