/rtv/media/media_files/2026/03/03/bloodplasma-vehicle-2026-03-03-21-44-38.jpg)
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పోలీసులు మంగళవారం ఫారిన్ లిక్కర్ స్మగ్లింగ్ చేసే ముఠాని పట్టుకున్నారు. సాధారణంగా అత్యవసర వైద్య సేవల కోసం ఉపయోగించే వాహనాలను పోలీసులు తనిఖీ చేయరనే నమ్మకంతో కొందరు నేరస్థులు బ్లడ్ ప్లాస్మా రవాణా చేసే వాహనాన్ని తమ అక్రమ వ్యాపారానికి వాడుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అత్యంత ఖరీదైన విదేశీ మద్యాన్ని తరలిస్తున్న ఈ ముఠా ఉదంతాన్ని హైదరాబాద్ స్టేట్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు బట్టబయలు చేశారు.
#Hyderabad:#Liquor worth ₹1.7 lakh seized from #BloodPlasma vehicle
— NewsMeter (@NewsMeter_In) March 3, 2026
STF Hyderabad seized 24 premium #Glenlivet bottles worth ₹1.7 lakh that were being illegally transported in a blood plasma vehicle from #Delhi to #Hyderabad.
Two persons, including the driver Chintala… pic.twitter.com/bVFtcUXYkN
గగిల్లాపూర్ – నర్సాపూర్ హైవేపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఒక బ్లడ్ ప్లాస్మా వాహనంపై అనుమానం వచ్చింది. దానిని ఆపి తనిఖీ చేయగా, లోపల ప్లాస్మాకు బదులుగా అత్యంత ఖరీదైన 'గ్లెన్లివెట్' బ్రాండ్‌కు చెందిన 24 ప్రీమియం లిక్కర్ బాటిళ్లు కనిపించాయి. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.1.7 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న డ్రైవర్ చింతల జైపాల్ రెడ్డితో పాటు మరొకరిని పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేశారు. ఢిల్లీ నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి, తనిఖీలు ఉండవనే ఉద్దేశంతో ప్లాస్మా వాహనంలో హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
వైద్య సేవలకు వాడే వాహనాలను ఇలాంటి అక్రమ పనులకు వాడటం పట్ల పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల నుంచి వాహనాన్ని, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Follow Us