Mohan Babu: మోహన్‌బాబు ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు
నటుడు మోహన్ బాబు గురించి హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. ఆయన కోసం ఐదు పోలీస్ బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు గానూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నటుడు మోహన్ బాబు గురించి హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. ఆయన కోసం ఐదు పోలీస్ బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు గానూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకున్న టైం నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరచిన వరకు టైం టు టైం అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి.
అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని హైకోర్టు తెలిపింది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ స్పందించారు. తొక్కిసలాట ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిదన్నారు. ఇందులో తన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం పై నటుడు బ్రహ్మాజీ మండిపడ్డారు. "దేశంలో చాలా చోట్ల తొక్కిసలాట జరిగింది. ఎవరినైనా అరెస్ట్ చేశారా..? అలా చేస్తే సగం మంది రాజకీయ నాయకులు జైలుకు వెళ్తారు" అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 14 రోజులు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే హైకోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయాలని బన్నీ లాయర్లు చెబుతున్నారు.
తెలంగాణ కోర్టు మోహన్ బాబుకు షాక్ ఇచ్చింది. జర్నలిస్టుల పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్ కోరగా.. తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
బాలయ్య - బాబీ కాంబోలో తెరక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్'. తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమా ఫస్ట్ సింగిల్ 'డాకూస్ రేజ్' ప్రోమోను విడుదల చేశారు. పూర్తి వీడియో సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
నేడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం' నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ నుంచి 'మీనూ' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో వెంకీ మామ లుక్ 'ఘర్షణ' సినిమాను గుర్తుచేస్తోంది.