మోహన్ బాబుకు తెలంగాణ కోర్టు బిగ్ షాక్!

తెలంగాణ కోర్టు మోహన్ బాబుకు షాక్ ఇచ్చింది. జర్నలిస్టుల పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్ కోరగా.. తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

New Update

Mohan Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు మంగళవారం జ‌ల్‌ప‌ల్లిలోని తన నివాసంలో జర్నలిస్టుపై మైకులతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై నేపథ్యంలో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే ఈ కేసులో నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన పిటీషన్ దాఖలు చేశారు. అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. 

Also Read:మంచు ఫ్యామిలీ వివాదాలకు సౌందర్యతో లింక్.. అసలు విషయం తెలిస్తే షాక్!

ముందస్తు బెయిల్ వాయిదా.. 

కాగా, తాజాగా తెలంగాణ కోర్టు మోహన్ బాబుకు షాకిచ్చింది.  ముందస్తు బెయిల్ పిటీషన్ ని తిరస్కరించింది.  తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.  ఇది ఇలా ఉంటే.. మంచు ఫ్యామిలీలో వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మొన్నటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్న వీళ్ళ గొడవ..  ఇప్పుడు రచ్చకెక్కడం చర్చనీయాంశమైంది.  మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇంతటితో ఆగలేదు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, మోహన్ బాబు.. ప్రశ్నించేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై చేయి చేసుకోవడం రచ్చ రచ్చగా మారింది.  

Also Read:ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!

Advertisment
Advertisment
తాజా కథనాలు