Venkatesh Birthday: అనిల్ రావిపూడి- వెంకటేష్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' . శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'మీనూ' సాంగ్ ప్రోమో
ఈ నేపథ్యంలో నేడు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ 'మీనూ' ప్రోమోను రిలీజ్ చేశారు. మీనాక్షి చౌదరీ, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ కాంబోలో సాగిన ఈ డ్యూయెట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో వెంకీ మామ పోలీస్ లుక్ 'ఘర్షణ' సినిమాను గుర్తుచేస్తోంది.
Also Read: మంచు ఫ్యామిలీ వివాదాలకు సౌందర్యతో లింక్.. అసలు విషయం తెలిస్తే షాక్!
This is for all our Victory @VenkyMama Gari fans out there 😍😍😍
— Anil Ravipudi (@AnilRavipudi) December 13, 2024
Let's celebrate this special day with a beautiful promo of #Meenu Song from #SankranthikiVasthunam ❤️
— https://t.co/0Pqxuysg9O#HBDVictoryVenkatesh ❤️
A big treat awaits you all for Sankranthi in cinemas on… pic.twitter.com/yWqUH7w557
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'గోదారి గట్టు మీద' సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పాపులర్ సింగర్ రమణ గోగుల ఈ పాటను పాడారు. దాదాపు 15 ఏళ్ళ తర్వాత సింగర్ రమణ గోగుల కమ్ బ్యాక్ ఇచ్చారు.
Also Read: ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!