Mohan Babu: మోహన్‌బాబు ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు

నటుడు మోహన్ బాబు గురించి హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. ఆయన కోసం ఐదు పోలీస్ బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు గానూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

author-image
By Manogna alamuru
New Update
Mohan BABU

ఒక వైపు అల్లు అర్జున్ అరెస్ట్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీ అట్టుడుకిపోతోంది. మరోవైపు సీనియర్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం కూడా ఇంకా పోలీసులు చుట్టూ తిరుగుతోంది. ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంట్లోనే చూసుకోవాలి అని రాజకొండ సీపీ మొత్తం కుటుంబానికి వార్నింగ్ ఇచ్చారు. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. నటుడు మోహన్‌బాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు గానూ మోహన్‌బాబుపై కేసు నమోదు అయింది.  ఆయనపై హత్యాయత్నం కేసును రిజిస్టర్ చేశారు పోలీసులు.  తక్షణమే మోహన్‌బాబును అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. 

షాకిచ్చిన హైకోర్టు..

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు మంగళవారం జ‌ల్‌ప‌ల్లిలోని తన నివాసంలో జర్నలిస్టుపై మైకులతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై నేపథ్యంలో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే ఈ కేసులో నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన పిటీషన్ దాఖలు చేశారు. అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేసిన తెలంగాణ కోర్టు మోహన్ బాబుకు షాకిచ్చింది.  ముందస్తు బెయిల్ పిటీషన్ ని తిరస్కరించింది.  తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Rashmika: నేను నమ్మలేకపోతున్నా–రష్మిక

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు