'డాకూస్' రేజ్.. బాలయ్య ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!

బాలయ్య - బాబీ కాంబోలో తెరక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్'. తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమా ఫస్ట్ సింగిల్ 'డాకూస్ రేజ్' ప్రోమోను విడుదల చేశారు. పూర్తి వీడియో సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

New Update

'డాకూస్ రేజ్' ఫస్ట్ సింగిల్

అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ టైటిల్ సాంగ్  'డాకూస్ రేజ్' లిరికల్ వీడియో ప్రోమోను రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ వీడియోను రేపు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.సాంగ్ ప్రోమో చూస్తుంటే తమన్ బీజీఎం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.   ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా  విడుదల కానుంది. 

ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 4న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్‌ ఫీమేల్ లీడ్స్ గా  నటిస్తున్నారు. 

Also Read:  అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ వచ్చేసింది! ఏమన్నారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు