జైలుకు అల్లు అర్జున్.. 14 రోజులు రిమాండ్!

అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 14 రోజులు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే హైకోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయాలని బన్నీ లాయర్లు చెబుతున్నారు.

New Update
ALLU ARJUN (2)

TG: అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 14 రోజులు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే హైకోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయాలని బన్నీ లాయర్లు చెబుతున్నారు.

సీఎం రేవంత్ రియాక్షన్

Also Read: హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అరెస్టు

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి బన్నీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఇందులో ఎవరి జోక్యం ఉండదని చెప్పారు. 'అల్లు అర్జున్ అరెస్టులో నా జోక్యం ఏమీ లేదు. చట్టం ముందు అందరూ సమానమే. చట్టపరంగా ఎలాంటి ప్రక్రియ జరుగుతుందో.. అల్లు అర్జున్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు. 'పుష్ప2' మూవీ ధియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన క్రమంలోనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇది అవమానకంర.. బండి సంజయ్

Also Read: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు

ఇదిలాఉంటే.. జాతీయ అవార్డు గ్రహీత నటుడు అల్లు అర్జున్‌కు సమయం ఇవ్వకుండా నేరుగా తన బెడ్‌రూమ్ నుండి తీసుకెళ్లడం అవమానకరమని  కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసిన తీరు సరికాదన్నారు. మహిళా అభిమాని మరణించడం చాలా దురదృష్టకరం. ఇది భారీ జనసందోహాన్ని నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మాత్రమే నొక్కి చెబుతుంది. సరైన ఏర్పాట్లను నిర్వహించలేకపోవడమే నిజమైన వైఫల్యం’ అటూ విమర్శలు గుప్పించారు. 

బన్నీ నేరస్థుడు కాదు.. కేటీఆర్

Also Read: బోడుప్పల్లో భారీ గంజాయి చాక్లెట్ల పట్టివేత.. బీహార్‌ నుంచి తెప్పించి..

జాతీయ అవార్డు పొందిన ఒక నటుడిని అరెస్టు చేసిన తీరు పాలకుల అభద్రతా భావానికి నిదర్శనమని కేటీఆర్ అన్నాడు. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి నా సానుభూతి ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ఈ ఘటనలో విఫలమైంది ఎవరు? అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్థుడిలా చూడటం సరికాదు. తొక్కిసలాట ఘటనకు ఆయన నేరుగా బాధ్యుడు కాదు. బన్ని అరెస్టు తీరును ఖండిస్తున్నా. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ బాధ్యుడని అరెస్టు చేశారు. ఇదే లాజిక్‌తో రేవంత్‌రెడ్డి కూడా అరెస్టు చేయాలి. హైడ్రా వల్ల ఇద్దరి మరణానికి రేవంత్‌ కారణమయ్యారంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు.

పోలీసు శాఖ వైఫల్యామే.. రాజాసింగ్

Also Read: Ap: ఏపీ పై అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త!

సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పోలీసు శాఖ వైఫల్యమేనని  గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. ఈ ఘటనలో జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్‌ తప్పు లేదని చెప్పారు. అతడు నేరుగా బాధ్యత వహించని దానికి అతడిని జవాబుదారీగా ఉంచడం అన్యాయమన్నారు. ఇది అసమంజసం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అల్లు అర్జున్‌కి గౌరవం ఇవ్వాలి. నేరస్థుడిగా పరిగణించకూడదు’ అని మండిపడ్డారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు