Suriya-Jyotika: బీచ్ లో చిల్ అవుతున్న స్టార్ కపుల్! సూర్య కొత్త లుక్ అదిరింది

తమిళ స్టార్ సూర్య  భార్యతో కలిసి ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్ (Seychelles) అనే అందమైన ఐలాండ్ కి వెకేషన్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను జ్యోతిక తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు.

New Update
suriya - jyotika vacation

suriya - jyotika vacation

Suriya-Jyotika: తమిళ స్టార్ హీరో భార్య జ్యోతికతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన రెట్రో సినిమా తర్వాత కాస్త విరామం తీసుకున్న సూర్య..  భార్యతో  ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్ (Seychelles) అనే అందమైన ఐలాండ్ కి వెకేషన్ వెళ్లారు. ఈ బ్యూటిఫుల్ కపుల్  అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ  చిల్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను జ్యోతిక తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. 'స్వర్గంలో మరో రోజు మనిద్దరం' అంటూ జ్యోతిక క్యాప్షన్ పెట్టారు. ఈ పిక్స్  సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇవి చూసిన అభిమానులు సూర్య- జ్యోతిక జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. క్యూట్, బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Also Read:Shefali Jariwala: షెఫాలీ ఆకస్మిక మరణంలో జోస్యం నిజమైందా? వైరలవుతున్న పాత వీడియో!

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

Also Read :  చెత్త లారీలో నగ్నంగా మహిళ మృతదేహం.. సినిమా లెవెల్‌లో దారుణ హత్య!

కొత్త లుక్ వైరల్

అయితే ఈ ఫొటోల్లో సూర్య లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది.  గ్రే హెయిర్ గడ్డంతో న్యూ లుక్ లో కనిపించారు. దీంతో ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన లుక్కా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.  సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో  ఓ సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్ టైనమెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను.. ఇటీవలే పూజ కార్యక్రమాలతో  అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో యంగ్ బ్యూటీ మమితా బైజు కథానాయికగా నటిస్తుంది. దీనితో పాటు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో 'కరుప్పు' సినిమా కూడా చేస్తున్నారు సూర్య. 

Also Read:Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!

cinema-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | actor-suriya | heroine-jyothika

Advertisment
తాజా కథనాలు