Shefali Jariwala: షెఫాలీ ఆకస్మిక మరణంలో జోస్యం నిజమైందా? వైరలవుతున్న పాత వీడియో!

బాలీవుడ్ నటి షెఫాలీ మరణం సినీ తారలు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ క్రమంలో షెఫాలీ.. పరాస్  పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఓ పాత వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

New Update
Shefali Jariwala

Shefali Jariwala

Shefali Jariwala: బాలీవుడ్ నటి షెఫాలీ శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి. షెఫాలీ ఆకస్మిక మరణంతో సినీ తారలు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి చెందారు.  ఈ క్రమంలో షెఫాలీ.. పరాస్  పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఓ పాత వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో క్లిప్ లో పరాస్.. ఆమె  ఆస్ట్రాలజీ  గురించి మాట్లాడుతూ  ఆమె ''ఆకస్మిక మరణం'' గురించి వింత వ్యాఖ్యలు చేశాడు.

Also Read: Shafali Jariwala: 15 ఏళ్ల వయసులోనే ఆ వ్యాధి.. 42 ఏళ్లకు మృతి! షెఫాలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే 

ముందే జోస్యం 

పరాస్ మాట్లాడుతూ.. మీ 8వ ఇంట్లో చంద్రుడు, బుధుడు, కేతువులు ఉన్నారు. చంద్రుడు, కేతువుల కలయిక చాలా చెడ్డది. ఇది  ఆకస్మిక మరణం, కీర్తి, రహస్యాలు, తంత్రాలకు సంబంధించిన విషయాలను కూడా సూచిస్తుంది. మీకు చంద్రుడు, కేతువుల వల్ల ఇప్పటికే చెడు జరుగుతోంది, ఇప్పుడు బుధుడు కూడా వారితో చేరాడు'' అని చెప్పాడు. అలాగే గ్రహాల అమరిక ఆందోళన,  నరాల సంబంధిత సమస్యలను సూచిస్తుందని పరాస్ వివరించాడు. 

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

ఇదే సంభాషణలో  షెఫాలీ తన యుక్తవయస్సులో ఎదుర్కొన్న ఎపిలెప్సీ (మూర్ఛ) సమస్యల గురించి కూడా వెల్లడించింది. తనకు 15 సంవత్సరాలు అంటే పదవ తరగతిలో ఉన్నప్పుడు మూర్ఛ వచ్చిందని తెలిపింది. యోగ, ధ్యానం, సరైన జీవన శైలి ద్వారా ఆ సమస్యను అధికమించినట్లు వివరించింది. ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా తాను ఆ వ్యాధి నుంచి ఫ్రీగా ఉన్నానని తెలిపింది. అలాగే ఎపిలెప్సీ గురించి చాలా మందికి అవహగాన కూడా కల్పించినట్లు పేర్కొంది. 

Also Read: Samantha: మళ్ళీ బిజీ అవుతున్న సామ్.. సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్ లో అదుర్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు