/rtv/media/media_files/2025/06/29/ee-nagaraniki-emaindi-sequel-2025-06-29-13-00-07.jpg)
Ee Nagaraniki Emaindi sequel
Ee Nagaraniki Emaindi: ఏడేళ్ల క్రితం విడుదలైన సూపర్ హిట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'ఈ నగరానికి ఏమైంది' మళ్ళీ ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త కథతో సిద్ధమవుతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. "ఏలినాటి శని అయిపోయింది, కన్యా రాశి టైం వచ్చింది!" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ సీక్వెల్‌ను ప్రకటించారు. ఈ సీక్వెల్‌కు 'ENE Repeat' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్‌లో కనిపించిన ఫ్లైట్ టికెట్, ఇతర వస్తువులు చూస్తుంటే ఈసారి ముగ్గురి స్నేహితుల మ్యాడ్ నెస్ , అల్లరి దేశం దాటి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఈ ఒక్క రోజే అదిరిపోయే ఆఫర్.. ఫ్లైట్ టికెట్ కేవలం రూ.1,499 మాత్రమే!
Last time they took a trip.
— Suresh Productions (@SureshProdns) June 29, 2025
and turned it into a Cult ❤️🔥
Now they are back to REPEAT
the madness and ruin your routine 😎#ENERepeat will be our hangover from here on 🍻
— https://t.co/qrumhjJ66Z
PRE PRODUCTION BEGINS ✅ #TharunBhascker @VishwakSenActor @AbhinavGomatam… pic.twitter.com/n4z5fDsAWc
Also Read : వివో నుంచి అరాచకమైన ఫోన్.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే - ఫీచర్లు హైలైట్!
త్వరలో షూటింగ్
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కకుమాను - ఈ నలుగురు స్నేహితులు మళ్లీ తెరపై సందడి చేయబోతున్నారు. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో వీరి కెమిస్ట్రీ, కామెడీ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాయి.
201లో తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. స్నేహం, సరదా, జీవితంలో గందరగోళం... ఈ అన్నిటిని కలగలిపి అద్భుతంగా రూపొందించారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Also Read: Shefali Jariwala: షెఫాలీ ఆకస్మిక మరణంలో జోస్యం నిజమైందా? వైరలవుతున్న పాత వీడియో!
Also Read : "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!
latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news