/rtv/media/media_files/2025/06/29/samantha-counter-to-trollers-2025-06-29-16-49-04.jpg)
samantha counter to trollers
నటి సమంత తన ఆరోగ్యం, శరీరాకృతి పై కామెంట్లు చేస్తున్న వారికి దీటైన సమాధానం ఇచ్చింది. అయితే గత కొంతకాలంగా సామ్ మాయోసైటీస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సామ్ శారీరకంగా కొన్ని సవాళ్ళను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే సామ్ ఓ ఈవెంట్ లో కనిపించగా కొందరు నెటిజన్లు ఆమె ఆరోగ్యం, శరీరాకృతి పై అనవసరమైన కామెంట్లు చేశారు. 'సన్నబడ్డావు', 'నీరసంగా కనిపిస్తున్నావు 'అని అన్నారు. దీంతో సామ్ స్పందించారు. ఇలాంటి కామెంట్లు చేసేవారందరికీ ఓ సవాలు విసురుతూ కౌంటర్ ఇచ్చారు.
Also Read: Shefali Jariwala: షెఫాలీ ఆకస్మిక మరణంలో జోస్యం నిజమైందా? వైరలవుతున్న పాత వీడియో!
Also Read : అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌పై సంచలన తీర్పు
సామ్ సవాల్
జిమ్ లో పుల్-అప్‌లు చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు మూడు పుల్-అప్‌లు పూర్తి చేయగలిగితే తప్పా!.. నన్ను సన్నబడ్డావు , అనారోగ్యంగా ఉన్నావు అంటూ చెత్త కామెంట్స్ చేయడానికి వీల్లేదు అని పోస్ట్ పెట్టారు. గతంలో కూడా తన బరువు గురించి వచ్చిన ప్రశ్నలకు సామ్ స్పందిస్తూ.. తన ఆరోగ్యం కోసమే ఒక ప్రత్యేకమైన డైట్ పాటిస్తున్నానని, అది బరువు పెరగకుండా చేస్తుందని వివరించింది. ఇదిలా ఉంటే సమంత గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీని ధైర్యంగా ఎదుర్కొంటుంది. తన విడాకులు, అనారోగ్యం, సినిమా ఫలితాలు... ఇలా ఏ విషయంపై ట్రోల్స్ వచ్చినా, ఆమె నిరాశ పడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అవసరమైతే గట్టిగా సమాధానం ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం సామ్ లైనప్ ప్రాజెక్ట్స్ తో సిద్ధంగా ఉంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' అనే డ్రామా సిరీస్‌లో నటిస్తోంది. అలాగే తన సొంతం ప్రొడక్షన్ లో 'మా ఇంటి బంగారం' అనే సినిమా కూడా చేస్తోంది.
Also Read : చార్‌ధామ్ భక్తులకు బిగ్ అలర్ట్.. మరోసారి యాత్ర వాయిదా!
Also Read : రాత్రి నిద్రలో పదే పదే నీరు తాగుతారా..? ఇది వ్యాధని తెలుసుకోండి..!!
latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | tollywood | 2025 Tollywood movies | samantha