/rtv/media/media_files/2025/06/29/us-supreme-court-pronounces-verdict-on-birthright-citizenship-order-2025-06-29-19-24-03.jpg)
US Supreme Court pronounces verdict on Trump's birthright citizenship order
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులను పంపించడం, బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ రద్దు లాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. చాలావరకు ఎగ్జిక్యూటీవ్ ఆర్టర్‌పై సంతకాలు చేశారు. అయితే తాజాగా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ మరోసారి చర్చనీయాంశమైంది. ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌ను రద్దు చేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇక వివరాల్లోకి వెళ్తే 2025 జనవరిలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక బర్త్‌రైట్ సిటిజన్ షిప్‌ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌ను జారీ చేశారు.
Also Read: ఉక్రెయిన్‌పై అదిపెద్దదాడి... 477 డ్రోన్లు, 60 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా...
Birthright Citizenship In US
దీనిప్రకారం అమెరికాలో గ్రీన్‌కార్డు లేనివారికి పిల్లలు పుడితే పౌరసత్వం రాదు. దీంతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో పలువురు ఈ నిర్ణయంపై ఫెడరల్ కోర్టులను ఆశ్రయించారు. దీంతో కోర్టులు ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌ను నిలిపివేశాయి. ఈ క్రమంలోనే ఫెడరల్ కోర్టుల నిర్ణయంపై అధ్యక్షుడు ట్రంప్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాజాగా ఈ అంశంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.
Also Read: మళ్లీ ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తున్న పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను నిలుపుదల చేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదని తేల్చిచెప్పింది. ఇప్పటిదాకా అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమెటిక్‌గా అక్కడి పౌరసత్వం వచ్చేది. ఇప్పుడు ఇకనుంచి అలా చెల్లదు. అమెరికాలో దాదాపు 55 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీళ్లలో 34 శాతం మంది అమెరికాలో పుట్టిన వారే. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో లక్షలాది భారతీయులు ఆందోళనలో ఉన్నారు.
Also Read: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. హమాస్ కీలక నేత హతం
Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. జులై 1 వరకు భారీ వర్షాలు
birthright citizenship usa india | birthright citizenship | trump | rtv-news | telugu-news