/rtv/media/media_files/2025/06/09/nxG5SL3qaMBoqKdgTc2Z.jpg)
ranbir- alia new house
Ranbir Kapoor: ముంబై బాంద్రాలోని రణబీర్ కపూర్, ఆలియా భట్ డ్రీమ్ హౌజ్ దాదాపు సిద్ధమైంది. ఆరు అంతస్తుల ఈ బంగ్లా పనులు చివరి దశకు చేరుకున్నాయని, మరో రెండు, మూడు నెలల్లో రణబీర్ దంపతులు గృహప్రవేశం కూడా చేయనున్నారని సమాచారం. రణబీర్ తాత రాజ్కపూర్ కి చెందిన ఈ ఇంటిని .. గత ఏడాదిగా రణబీర్, ఆలియా పెద్ద ఎత్తున రీమోడలింగ్ చేయిస్తున్నారు. విలాసవంతమైన ఈ ఆరంతస్థుల భవనం ప్రస్తుతం ₹250 కోట్లు విలువ చేస్తుందని చెబుతున్నారు.
Also Read: Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్
Also Read : రిలేషన్ షిప్ వద్దన్నందుకు OYO రూమ్లో పొడిచి చంపేశాడు..
కుమార్తె రాహా పేరు మీద రిజిస్ట్రేషన్
అయితే తరతరాలుగా వస్తున్న ఈ ఇంటిని .. రణబీర్ కపూర్ తమ కూతురు రాహా పేరు మీద రిజిస్టర్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ ఇల్లంతా రాహాను దృష్టిలో ఉంచుకునే డిజైన్ చేసినట్లు సమాచారం. రణబీర్‌కి ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు.. తన కుటుంబ వారసత్వానికి ప్రతీక. అయితే రాహా పుట్టినప్పటి నుంచి , వ్యక్తిగతంగా, వృత్తిపరంగా
ఆయనకు అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయట. ఈ భావోద్వేగ అనుబంధానికి గుర్తుగా, రణబీర్ ఈ ఇంటిని తన కుమార్తె పేరున పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read: Jamie Lever: నన్ను చూసి హస్త ప్రయోగం చేసుకున్నాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఈ బంగ్లాకు రణబీర్ కపూర్ తన దివంగత నానమ్మ కృష్ణ రాజ్ కపూర్ పేరు పెట్టారు. ఇంటికి సంబంధించిన ఫైనల్ వర్క్స్ త్వరగా పూర్తయితే .. ఈసారి దీపావళిని రాహాతో కలిసి కొత్త ఇంట్లో జరుపుకోవాలని అనుకుంటున్నారట రణబీర్.
cinema-news | alia-bhatt | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news