Mahesh Babu T-Shirt: వామ్మో! ఒక్క టీ- షర్ట్ ధర అన్ని లక్షలా.. అక్కినేని రిషెప్షన్ లో మహేష్ లుక్ వైరల్

అక్కినేని అఖిల్- జైనాబ్ రిసెప్షన్ వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు ధరించిన టీ- షర్ట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ హెర్మేస్ కి చెందిన ఈ టీ- షర్ట్ సుమారు రూ. 1.51 లక్షలు ఉంటుంది. దీంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు.

New Update
Akhil reception Mahesh babu t- shirt

Akhil reception Mahesh babu t- shirt

Mahesh Babu T-Shirt: అక్కినేని అఖిల్ రెసెప్షన్(Akkineni Akhil Reception) వేడుక సినీ తారల సందడితో ఆదివారం రాత్రి  అట్టహాసంగా ముగిసింది. ఈ వేడుకలో చాలా మంది సెలెబ్రెటీలు సూట్, షేర్వానీ లో గ్రాండ్ గా కనిపించగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం  టీ- షర్ట్ లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహేష్ లుక్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఫ్యాన్స్ ఆయన ధరించిన ఫుల్ స్లీవ్ టీ- షర్ట్ గురించి తెగ సెర్చ్ చేయగా.. మతిపోయే విషయం తెలిసింది. 

రూ. 1.51 లక్షలు

ఆ టీ- షర్ట్ అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ హెర్మేస్ బ్రాండ్ కి చెందినదిగా గుర్తించారు. దీని ధర సుమారు రూ. 1.51 లక్షలు ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం ఈ టీ- షర్ట్ ధర  నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అలాగే మహేష్ బాబు కూతురు సితార కూడా పేస్టల్ పింక్ లెహంగాలో ఎంతో ముద్దుగా కనిపించింది. 

Also Read: Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్

Advertisment
Advertisment
తాజా కథనాలు