Jamie Lever: నన్ను చూసి హస్త ప్రయోగం చేసుకున్నాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ నటి జెమీ లివర్ చిన్నతనంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి పంచుకున్నారు. ఓ వ్యక్తి తన ముందు నిలబడి హస్తప్రయాగం చేసుకున్న ఘటన తనను ఎంతగానో కలచివేసిందని తెలిపింది. చాలాకాలం పాటు ఆ సంఘటన తనను వెంటాడిందని వాపోయారు.

New Update
Actor Jamie Lever recalls sexual harassment

Actor Jamie Lever recalls sexual harassment

Jamie Lever:  బాలీవుడ్ నటి  జెమీ లివర్ హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు. ఈ బ్యూటీ  తెలుగులో అల్లరినరేష్  'ఆ ఒక్కటి అడక్కు' సినిమాతో ప్రేక్షకులకు పరిచమైంది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెమీ చిన్నతనంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి పంచుకున్నారు. ఆ సంఘటనలు తనను ఇప్పటికీ కలచివేస్తాయని ఆవేదన చెందారు. 

Also Read :  భర్తతో కలిసి డ్యాన్స్ చేసిన మహువా మెయిత్రా.. వీడియో వైరల్

నన్ను చూసి హస్త ప్రయోగం!

ఈ మేరకు జెమీ చిన్నతనంలో జరిగిన ఓ షాకింగ్ సంఘటనను బయటపెట్టారు. జెమీ మాట్లాడుతూ.. ''ఒకసారి నేను, నా స్నేహితుడు మా అన్నయ్య కోసం కారు ముందు నిలబడి వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి నా ఎదురుగా నిలబడి అశ్లీలంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. నా ముందే  హస్త ప్రయోగం చేసుకోవడం స్టార్ట్ చేశాడు. నేను మగవారి ప్రైవేట్ పార్ట్ చూడడం అదే మొదటి సారి. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని కావడంతో అతడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు!  దీంతో వెంటనే నా ఫ్రెండ్ కి..   నీ వెనుక ఓ భయంకరమైన వ్యక్తి ఉన్నాడు.. అతడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు అని చెప్పాను. అప్పుడు నా ఫ్రెండ్.. అతడిని పట్టించుకోకుండా.. మాట్లాడడం కొనసాగించమని చెప్పాడు.'' 

''కొంతసేపటికి మేము గ్రహించడంలేదని గమనించిన ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ.. ఆ సమయంలో నేను చాలా భయపడ్డాను, వణికిపోయాను! అప్పుడు నాకు  కేవలం 10 -12 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికీ ఆ సంఘటన నన్ను ఎంతో బాధిస్తుంది'' అంటూ తనకు ఎదురైనా చేదు అనుభవం గురించి తెలిపారు. 

Also Read :  తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా!

Also Read :  టీమ్‌ఇండియాకు కొత్త కోచ్.. ఆయన మరెవరో కాదు

ఇదిమాత్రమే కాదు తన స్కూల్ బస్ డ్రైవర్ కండక్టర్ అనుచిత ప్రవర్తన గురించి కూడా జెమీ మాట్లాడారు. అతడు తమను అనుచితంగా తాకేవాడని తెలిపింది. ఈ సంఘటనలన్నీ ఒక పీడ కలల లాంటివని,  వీటిని గుర్తుచేసుకోవడం కూడా తనకు ఇష్టంలేదని  వాపోయారు.

Also Read: Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్

 

latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | sexual-harassment | Bollywood Actress

Advertisment
Advertisment
తాజా కథనాలు