RC16 Latest Updates: క్రికెట్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో చెర్రీ మూవీ..హింట్‌ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్‌!

రామ్ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌ లో స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్ లో ఓ మూవీ రానున్నట్లు చాలారోజుల నుంచి వార్తలు వినపడుతున్నాయి. తాజాగా ఈ మూవీకి వర్క్‌ చేస్తోన్న సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు పెట్టిన పోస్ట్‌ ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నాయి.

New Update
Ram Charan

RC16 Latest Updates

RC16 Latest Updates: రామ్ చరణ్‌(Ram Charan)హీరోగా బుచ్చిబాబు(Director Buchi Babu Sana) డైరెక్షన్‌ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 16 గా ఇది ప్రచారంలో ఉంది. ఇటీవల దీని రెగ్యులర్‌ షూట్‌ మొదలైంది. అయితే ఈ సినిమా స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్ లో రానున్నట్లు చాలారోజుల నుంచి వార్తలు వినపడుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు వర్క్‌ చేస్తోన్న సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు పెట్టిన పోస్ట్‌ ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నాయి.

Also Read: Vijayasai Vs Kethireddy: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే రత్నవేలు తాజాగా ఆర్సీ 16 షూటింగ్‌ అప్డేట్‌ను పంచుకున్నారు. నైట్‌ షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలుపుతూ ఓ ఫొటో షేర్‌ చేశారు. అయితే ఆ పోస్ట్‌ కు ఆయన పెట్టిన క్యాప్షన్స్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ''నైట్‌ షూట్‌,ఫ్లడ్‌ లైట్స్‌, క్రికెట్‌ పవర్‌,డిఫరెంట్‌ యాంగిల్స్‌ అని క్యాప్షన్‌ పెట్టారు.

Also Read: Telangana: సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

క్రికెట్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో RC16

క్రికెట్‌ స్టేడియంలో ఉండే లైట్‌ ల ఫొటోను పంచుకున్నారు.దీంతో ఈ సినిమా క్రికెట్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో రానుందని అభిమానులు పోస్ట్‌ లు పెడుతున్నారు.గతంలోనూ ఈ సినిమా గురించి రత్నవేలు ఓ పోస్ట్‌ పెట్టి అందరిలో ఆసక్తి కలిగించారు.ఇందులోని ఓ సీక్వెన్స్‌ కోసం నెగెటివ్‌ రీల్‌ వినియోగించనున్నట్లు తెలిపారు.

ఖర్చుతో కూడుకున్న...

సహజత్వం కోసం అలా చేయనున్నట్లు పేర్కొన్నారు. దేవర సినిమాకీ కొంతమేర ఆ ప్రయత్నం చేశానని చెప్పారు. పూర్తి స్థాయిలో నెగెటివ్‌ రీల్‌ తో షూటింగ్‌ చేయడం తేలికైనవిషయం కాదు.డిజిటల్‌ కెమెరాలతో
షూటింగ్‌ చేస్తుంటే..నటులు ఎన్నిటేక్స్‌ తీసుకున్నా సమస్య ఉండదు. అదే నెగెటివ్‌ ఉండే కెమెరాలతో చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని పేర్కొన్నారు.బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల  నుంచి వర్క్‌ చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తుంది. ఇందులో చరణ్‌  పాత్ర పవర్‌ ఫుల్‌ గా ఉండనుంది.

జాన్వీ కపూర్‌ కథానాయిక.కన్నడ నటుడు శివ రాజ్‌ కుమార్‌,జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.రెహమాన్‌ స్వరాలు అందించనున్నారు.మైత్రీ మూవీ మేకర్స్‌ వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌రటింగ్ష్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్‌ ప్రచారం లో ఉంది.

ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్‌ వర్క్స్‌ మొదలయ్యాయిన..రెండు పాటలు కూడా పూర్తి చేశానని ఇటీవల రెహమాన్‌ తెలియజేశారు.  
 

Also Read: Kshama Sawanth: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ

Also Read: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు

#latest-telugu-news #ramcharan #rc16-movie #rc16 #cinema #latest-news #janhvi-kapoor-in-rc16 #telugu-news #latest telugu news updates
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు