Kshama Sawanth: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ

ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ అత్యవసర వీసాను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో క్షమా సావంత్ మద్దతుదారులు అమెరికాలోని సియాటెల్ లో ఉన్న భారత కాన్సులేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.

New Update
kshama sawanth

kshama sawanth

ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ అత్యవసర వీసాను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో క్షమా సావంత్ మద్దతుదారులు అమెరికాలోని సియాటెల్ లో ఉన్న భారత కాన్సులేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. పలువురు ఆందోళనకారులు గుమికూడటంతో శాంతిభద్రతల సమస్య ఏర్పడిందని, స్థానిక అధికారులను పిలవాల్సి వచ్చిందని భారత కాన్సులేట్ వర్గాలు తెలిపాయి.

Also Read: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడి వివాహం!

ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత కొంతమంది వ్యక్తులు కాన్సులేట్ ప్రాంగణంలోకి వచ్చే ప్రయత్నం చేశారని, వారిని ఎందుకు వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే, వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించామని భారత కాన్సులేట్ పేర్కొంది. అయితే వారు వెళ్లడానికి నిరాకరించారని వెల్లడించింది. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని, బెదిరింపులకు దిగారని పేర్కొంది. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో పోలీసులను పిలిపించినట్లు వెల్లడించింది.

Also Read: Delhi Assembly Results: ఢిల్లీ పీఠం ఎక్కేదెవరు..నేడే అసెంబ్లీ ఫలితాలు!

శాంతియుతంగా నిరసన...

ఈ ఆందోళనకు ఎవరు దిగారు, ఎందుకు దిగారనే విషయమై మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అదే సమయంలో, సియాటెల్ సిటీ కౌన్సిల్ మాజీ సభ్యురాలు క్షమా సావంత్ సోషల్‌ మీడియాలో  స్పందించారు. భారత్ వీసా తిరస్కరణకు గురైన వారిలో తన పేరు కూడా ఉందని, అందుకే తన మద్దతుదారులతో కలిసి కాన్సులేట్ ఎదుట నిరసన చేపట్టామని చెప్పారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపామని ఆమె పేర్కొన్నారు.

 మూడుసార్లు తన వీసా నిరాకరించినందుకు గల కారణాలు తెలపాలంటూ తన మద్దతుదారులతో కలిసి భారత కాన్సులేట్‌ ముందు శాంతియుతంగా నిరసన చేపట్టామన్నారు. క్షమా సావంత్‌కు భారత్‌ వీసా నిరాకరించడం ఇదే తొలిసారి కాదు. బెంగళూరులో ఉంటున్న ఆమె తల్లి దగ్గరకు వెళ్లేందుకు సావంత్‌ గతంలో ప్రయత్నించినప్పటికీ వీసా మంజూరు కాలేదు. ఆమె భర్త కాల్విన్‌ ప్రీస్ట్‌కు మాత్రం వీసా లభించింది.

Also Read:Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!

Also Read: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు