Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నకు ఫెడరల్‌ కోర్టులు షాకిస్తున్నాయి. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఆయన ఇచ్చిన ఉత్తర్వులను రెండు ఫెడరల్ కోర్టులు నిలిపేయగా..మరో కోర్టు అలాంటి ఆదేశాలనే ఇచ్చింది. ట్రంప్ తీరుపై మండిపడింది.

New Update
 US judge blocks Donald Trump's executive order

US judge blocks Donald Trump's executive order Photograph: ( US judge blocks Donald Trump's executive order)

అమెరికా వీసా, గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తోన్న విద్యార్థులు, వృత్తినిపుణులకు భారీ ఊరట లభించింది. జన్మతః పౌరసత్వ హక్కును రద్దుచేస్తూ అధ్యక్షుడు ట్రంప్ జారీచేసిన కార్యనిర్వహాక ఉత్తర్వులను మరో ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. అంతేకాదు, చట్టపరమైన నియమాలను ట్రంప్ ఉల్లంఘించి.. రాజ్యాంగం విధానాలతో ఆటలాడేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టు మండిపడింది. మేరీల్యాండ్ ఫెడరల్ కోర్టు సైతం ట్రంప్ ఉత్తర్వులను రద్దుచేసిన విషయం తెలిసిందే. 

Also Read: Vande Bharat Express: వందే భారత్‌లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్.. రైల్వేబోర్టు కీలక నిర్ణయం

అమెరికా జిల్లా న్యాయమూర్తి జాన్ కఫెనౌర్ ‘మన అధ్యక్షుడికి చట్ట పాలన అనేది తన విధాన లక్ష్యాలకు ఒక అవరోధం మాత్రమే అని తెలుస్తోంది. వ్యక్తిగత లేదా రాజకీయ స్వలాభం కోసమే చట్టపాలన అనేది ఆయన అభిప్రాయమే అయినా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడానికి వీల్లేదు’ అని చెప్పుకోచ్చారు.

Also Read: Saif Ali khan Attack: సైఫ్ ను పొడిచింది వాడే.. పోలీసుల ముందే గుర్తు పట్టిన పని మనుషులు!

రాజ్యాంగం అనేది ప్రభుత్వం విధానాలతో ఆటలాడుకునేది కాదని న్యాయమూర్తి స్ఫష్టం చేశారు. ఒకవేళ, జన్మతహః పౌరసత్వ హక్కును మార్చాలనుకుంటే, అది రాజ్యాంగ సవరణ చేయాలి’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా, యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి డెబోరా బోర్డ్‌మన్ ట్రంప్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రాథమిక నిషేధాన్ని జారీ చేశారు. ఆ మర్నాడే తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.

జన్మతః పౌరసత్వ హక్కును...

ఈ రెండు కోర్టుల ఉత్తర్వులు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. ఈ కేసు కొనసాగే వరకు అమలులో ఉంటాయి. మరోవైపు, సియాటిల్ కోర్టు ఉత్తర్వులపై తాను సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్టు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా, న్యాయ శాఖ సైతం ధ్రువీకరించింది. కాగా, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గత నెల 20న బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. విదేశీయులకు జన్మతః పౌరసత్వ హక్కును రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. 

రాజ్యాంగంలోని 14వ సవరణను దీనికి కారణంగా చూపించారు. అయితే 22 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేశాయి.మరోవైపు, బైఅవుట్స్ పేరుతో ఉద్యోగులను ఇంటికి సాగనంపడానికి ట్రంప్ చేస్తోన్న మరో ప్రయత్నానికి కోర్టు అడ్డుపడింది. రాజీనామాకు ముందుకొచ్చే వారికి ఇన్సెంటివ్‌ ఇస్తానన్న ట్రంప్‌ ఆదేశాలను బోస్టన్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి జార్జి ఒ టూల్‌ జూనియర్‌ తాత్కాలికంగా నిలిపివేశారు.

Also Read: CM Revanth-KTR Arrest: కేటీఆర్ కు జైలు ఇప్పట్లో లేనట్లే.. ఢిల్లీ టూర్‌లో సీఎం రేవంత్ సంచలన ప్రకటన!

Aslo Read: Iron Dome: అమెరికా ఐరన్ డోమ్ సిస్టమ్‌ అభివృద్ధిలో మేమూ భాగస్వాములవుతాం: కెనడా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు