Pushpa-2: వందేళ్ళ బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన పుష్ప–2

బయట వివాదాలు ఎలా ఉన్నా పుష్ప–2 సినిమా మాత్రం తన హవాను కొనసాగిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో తన ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటి వరకు హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్‌ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే 632 కోట్ల 50 లక్షలు సాధించిన రికార్డ్‌ సృష్టించింది. 

New Update
Pushpa-2: 'పుష్పరాజ్' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. ఆ బీట్ వింటే గూస్ బంప్సే!

రెండు వారాల తర్వాత కూడా హౌస్ ఫుల్ కలెక్షనలతో దూసుకుపోతోంది పుష్ప–2 సినిమా. రీసెంట్ టైమ్‌లో ఇంతగా ఆడిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. సుకుమార్ దర్శకత్వంలో అలు అర్జున్..పుష్ప–2తో అదరగొట్టాడు. ఒకవైపు కేసులు, గొడవతో సతమతమవుతున్న బన్నీ, మూవీ టీమ్. కానీ వీటితో నాకేం పని అన్నట్టు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది పుష్ప–2 మూవీ. విడుదలకు ముందే రికార్డ్‌లను కొల్లగొట్టిన ఈ సినిమా విడుదల అయ్యాక ఎవ్వరూ ఊహించని సరికొత్త చరిత్రలను రాస్తోంది. ముఖ్యంగా నార్త్‌లో తన ప్రభంజన చూపిస్తోంది. 

Also Read: ఒక్క సెషన్‌లో 9 లక్షల కోట్లు..వరుసగా ఐదవరోజూ నష్టాల్లో మార్కెట్

ఇది కూడా చూడండి: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

బాలీవుడ్ చరిత్రను తిరగరాసింది..

తాజాగా బాలీవుడ్‌లో ఏ సినిమా సాధించనటువంటి అరుదైన ఫీట్‌ను పుష్ప–2 సొంతం చేసుకుంది. హిందీ బాక్సాఫీసు లో అత్యధిక వసూళ్లు  సాధించిన సినిమాగా నిలిచింది. రూ.632 కోట్లు 50 లక్షలు కలెక్ట్‌ చేసి 100 ఏళ్ల బాలీవుడ్‌ చరిత్రను తిరగరాసింది. విడుదలైన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని వసూలు చేయడం మరో విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో రూ.1508 కోట్ల వసూలు చేసింది. కేవలం ముంబయ్‌లోనే 200 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. ఇక 2024 సంవత్సరంలో హ్యాయ్యెస్ట్‌ గ్రాస్‌ను సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డును నమోదు చేసింది. అల్లు అర్జున్‌ తన కెరీర్‌లో పుష్ప ది రైజ్‌, పుష్ప ది రూల్‌ చిత్రాలతో 2021 మరియు 2024లో బ్యాక్‌ టు బ్యాక్‌ హ్యాయెస్ట్‌ గ్రాసర్స్‌ వసూలు చేసిన ఇండియన్‌ సినిమాల హీరోగా కూడా కొత్త రికార్డ్‌లను సాధించాడు. అయితే ఇక్కడితో ఆగపోయేది కాదని..అల్లు అర్జున్, పుష్ప–2 ల కోసం మరిన్ని రికార్డ్‌లు వెయిట్ చేస్తున్నాయని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమా ప్రభంజనం మరికొన్నాళ్ళు సాగుతుందని అంటున్నారు. త్వరలోనే 2 వేల కోట్ల క్లబ్‌లో కూడా పుష్ప–2 సినిమా చేరుతుందని అంచనా వేస్తున్నారు. 

Also Read: Jaipur: గ్యాస్ లీకవడం వల్లనే అంత పెద్ద ప్రమాదం..సీసీ ఫుటేజ్

ఇది కూడా చూడండి: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు