ఒక్క సెషన్‌లో 9 లక్షల కోట్లు..వరుసగా ఐదవరోజూ నష్టాల్లో మార్కెట్ దేశీ స్టాక్ మార్కెట్ ఈరోజు కూడా నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ దాదాపు 4 వేల పాయింట్లు ష్టపోయింది. సెన్సెక్స్ 1176, నిఫ్టీ 375 పాయింట్ల నష్టపోయి ఒక్కరోజే 9 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. By Manogna alamuru 20 Dec 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు కంటిన్యూ అవుతున్నాయి. దానికి తోడు విదేశీ మదుపర్లు వరుసపెట్టి అమ్మకాలు చేశారు. ఇది దేశీ మార్కెట్ మీద ప్రభావం చూపించింది. దీంతో సెన్సెక్స్ 1176 పాయింట్ల పతనంతో 78,041 వద్ద ముగిసింది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 364 పాయింట్లు క్షీణించి, 23,587 దగ్గర ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 20 పెరగ్గా, 10 క్షీణించాయి. నిఫ్టీ స్టాక్స్ 45 క్షీణించగా, 5 మాత్రమే పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈలోని అన్ని రంగాల సూచీలు ఈరోజు క్షీణించాయి. నిఫ్టీ రియల్టీ 3.84%, నిఫ్టీ బ్యాంక్ 2.58%, నిఫ్టీ IT 2.42% మరియు నిఫ్టీ ఆటో 2.07% అతిపెద్ద క్షీణతను నమోదు చేశాయి.దీంతో ఇవాళ ఒక్కరోజే దాదాపు రూ.9 లక్షల కోట్లు ఆవిరై.. రూ.441 లక్షల కోట్లకు చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.03 దగ్గర ముగిసింది. వచ్చే ఏడాది వడ్డీ రేట్లలో మూడు లేదా నాలుగు సార్లు కోతలు ఉండొచ్చని మార్కెట్ అంచనా వేసింది. కానీ ఫెడ్ మాత్రం రెండుసార్లు మాత్రమే రేట్ల కోత ఉంటుందని చెప్పింది. ఇది నిన్న , ఇవాళ కూడా ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపించింది. దీనికి తోడు ఐటీ స్టాక్స్ ఇవాళ బాగా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫటీ ఐటీ ఇండెక్స్ 2.6 శాతం నష్టపోయింది. ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పుడు లాభాల్లోనే మొదలైన ఐటీ స్టాక్స్ తరువాత మాత్రం నష్టాల్లోకి జారుకున్నాయి. మరోవైపు ఆసియా మార్కెట్ లోనూ క్షీణత కనిపించింది. జపాన్‌కు చెందిన నిక్కీ 0.29%, కొరియా తాలూకా కోస్పి 1.30%, చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.058% నష్టపోయాయి. Also Read: భారతీయులు ఆ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి: మోహన్ భగవత్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి