AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!

ఏపీకి మరో వందే భారత్ ట్రైన్ వచ్చే అవకాశం ఉంది. విశాఖ-తిరుపతి మధ్య కొత్త వందే భారత్ ట్రైన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. లోక్ సభలో ఏపీకి చెందిన ఎంపీ ఈ విషయంపై కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

New Update
VandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!!

Ap: ఏపీకి  మరో వందేభారత్ రైలు రానుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ నుంచి ఇప్పటికే కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. పలువురు ఎంపీలు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఈ విషయం గురించి విజ్ఙప్తి చేశారు. అయితే కొన్ని రైళ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.ఈ మేరకు ఒకటి, రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు తాజాగా మరో వందేభారత్ రైలు ప్రతిపాదనాలు తెరపైకి వచ్చాయని సమాచారం.

Also Read: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

విశాఖ నుంచి వందేభారత్‌ రైళ్ల సంఖ్యను మరిన్ని పెంచాలని పలువురు ప్రజా ప్రతినిధులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే విశాఖపట్నం ఎంపీ వందేభారత్ రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు. విశాఖ నుంచి బెంగళూరుకు రైలు నడపాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే తాజాగా మరో ప్రతిపాదనను అధికారులు తీసుకొచ్చారు. విశాఖ నుంచి బెంగళూరుతో పాటుగా తిరుపతికి కూడా వందేభారత్ నడపాలని ప్రజా ప్రతినిధులు రైల్వే అధికారుల్ని కోరారు.

Also Read: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు

 అయితే తిరుపతి, బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్లాన్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ విషయం గురించి రైల్వే అధికారుల నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ క్లాస్ నడిపే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా  క్లారిటీ రావాల్సి ఉండగా..దానికి కొంత సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Also Read: పైలెట్ చేసిన తప్పువల్లే కమాండర్ బిపిన్ రావత్ మృతి

ప్రస్తుతం విశాఖ నుంచి నాలుగు వందేభారత్‌ రైళ్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రెండు.. భువనేశర్వ్, దుర్గ్‌కు చెరొకటి నడుస్తున్నాయి. విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ నడిపేందుకు ఆలస్యం అవుతుందని.. కనీసం ఆరు నెలలైనా సమయం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. చెన్నైలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ వందేభారత్ స్లీపర్ క్లాస్ రైళ్లు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే తొలి వందేభారత్ స్లీపర్ క్లాస్ జనవరి నాటికి అందుబాటులోకి వస్తుందనే సమాచారం ఉంది.

Also Read: Delhi: బాణాసంచాపై  ఢిల్లీలో శాశ్వత నిషేధం

దీన్ని బట్టి విశాఖపట్నం కోటా వచ్చేసరికి కనీసం ఆరు నెలలు సమయం పడుతుందని అధికారులు అనుకుంటున్నారు. వచ్చే ఏడాది జూన్, జులై నాటికి విశాఖపట్నం-తిరుపతి వందేభారత్‌ స్లీపర్ క్లాస్‌ మొదలువుతుందని తెలుస్తుంది.  విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్‌ పట్టాలెక్కితే మంచి ఆదరణ ఖాయం అంటున్నారు. అయితే దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. అంతేకాదు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఈ విశాఖ- తిరుపతి వందేభారత్ స్లీపర్ రైలు అంశాన్ని ప్రస్తావించారు. 

మరోవైపు ఇటీవల ఏపీకి మరో కొత్త వందేభారత్ వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. విజయవాడ నుంచి బెంగళూరుకు వయా గుంటూరు, పల్నాడు, రాయలసీమ మీదుగా వందేభారత్ ప్రారంభం అవుతుందనే చర్చ నడుస్తుంది. గతంలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.అయితే అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు