Ap Rains: ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం మరింత బలపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరంవైపు చేరే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. Also Read: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు ఆ తర్వాత 24 గంటల్లో ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో డిసెంబర్ 20వ తేదీ అంటే శుక్రవారం ,విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Also Read:CHAT GPT: వాట్సప్‌లోనూ ఇకపై చాట్ జీపీటీ మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ అన్నారు. Also Read: CBSC ఆకస్మిక తనిఖీలు.. దొరికిన డమ్మీ స్టూడెంట్స్ మరోవైపు అల్పపీడనం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం చెప్పింది. కోస్తా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు నుంచి విజయనగరం వరకూ కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నయని పేర్కొంది.ఈ సమయంలో సముద్ర తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల ఈదురు గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండురోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. Also Read: AP: పిఠాపురంలో TDP Vs జనసేన.. అలిగి వెళ్లిపోయిన వర్మ! ఇటీవలి కాలంలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఫెంగల్ తుపాను కారణంగా పలు జిల్లాలలో పంట నష్టం కూడా సంభవించింది. రాయలసీమ జిల్లాలలో ఎక్కువగా వర్షాలు పడుతుండటంతో.. పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. తిరుమల కొండపైన ఉన్న ఐదు రిజర్వాయర్లు కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి.