Jaipur: గ్యాస్ లీకవడం వల్లనే అంత పెద్ద ప్రమాదం..సీసీ ఫుటేజ్

11మంది చనిపోయారు...30 వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి..ఈరోజు ఉదయం జైపూర్‌‌లో జరిగిన అగ్ని ప్రమాదం బీభత్సం సృష్టించింది.  దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజి ఇప్పుడు వైరల్ అవుతోంది. ముందు గ్యాస్ లీక్ అయి తరువాత మంటలు అంటుకున్నట్టు దీనిలో తెలుస్తోంది.   

New Update
11

జైపూర్‌‌లోని అజ్మీర్‌‌లో భంక్రోటా ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌ దగ్గర ఈరోజు ఉదయం  పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది.  పెట్రోల్ బంక్‌ వద్ద ఆపి ఉంచిన సీఎన్‌జీ ట్యాంకర్‌ని పెట్రోల్‌ కోసం వచ్చిన మరో ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం నెలకొంది.  ఇందులో 11 మంది అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాదం సంభవించిన టైమ్‌కు అక్కడ చాలా వాహనాలు పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నాయి. దీంతో అవి కూడా వేగంగా అంటుకున్న మంటల్లో పడి కాలి బూడిద అయ్యాయి. మొత్తం 30 వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. 

 

ముందు గ్యాస్...తరువాత మంటలు..

ఈ ప్రమాదానికి సంబంధించి సీసీ ఈవీ ఫుటేటీ బయటకు వచ్చింది. సీఎన్జీ ట్యాంకర్‌‌ను మరో ట్రక్కు బలంగా ఢీకొంది. దీంతో ట్యాంకర్‌‌లో ఉన్న గ్యాస్ అంతా ముందు బయటకు  వ్యాపించింది. దాని వలనే మంటలు సెకన్లలో అక్కడ ఉన్న ప్రదేశం అంతటా అంటుకున్నాయి. గ్యాస్ చుట్టుపక్కలు ప్రదేశాలు, వాహనాలు, దగ్గరలో ఉన్న ఒక ఇల్లుకు సైతం వ్యాపించింది. గ్యాస్ వెంబడే మంటలు కూడా అంటుకున్నాయి. అగ్ని ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి 22 ఫైర్‌ ఇంజిన్లు చేరుకున్నాయి. భారీగా చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అగ్ని ప్రమాదం తర్వాత అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల తీవ్రంగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో పక్కనే ఉన్న రహదారిపై చాలాసేపు భారీగా ట్రాఫిక్‌ ఆగిపోయింది. ఇదంతా కళ్ళమందే నిమిషాల్లో జరిగిపోయింది. ఈ మొత్తం వీడియో సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: థంబ్ నెయిల్స్‌తో విసిగించేవారి ఆటకట్టు..రూల్స్ కఠినం చేయనున్న యూట్యూబ్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు